YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గాలివాన బీభత్సానికి 72 మంది మృతి

గాలివాన బీభత్సానికి 72 మంది మృతి

ఉత్తర భారతదేంలో గాలివాన బీభత్సం సృష్టించడంతో 72 మంది మృత్యువాతపడ్డారు. అనేక మందికి గాయాలయ్యాయి. బుధవారం (మే 2) అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం భారీ నష్టాన్ని మిగిల్చింది. బలమైన గాలుల కారణంగా ఇళ్లు, పెద్ద పెద్ద వృక్షాలు నేలకూలడంతో.. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్, పంజాబ్‌, హరియాణా రాష్ట్రాలపై ఈ గాలివాన ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం ఆయా ప్రాంతాల్లో గాలివాన బీభత్సం కారణంగా మొత్తం 72 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. బలమైన గాలులు, వర్షం ధాటికి 2000 విద్యుత్ స్తంభాలు, పెద్ద పెద్ద వృక్షాలు కుప్పకూలిపోయాయి. ఇళ్లు, రోడ్లు తీవ్రంగా ధ్వంసమ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యారు.ఉత్తరప్రదేశ్‌లోని నాలుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాదాపు 42 మంది చనిపోయారు. ఆగ్రాలోనే 36 మంది ప్రాణాలు కోల్పోయారు. బిజ్నోర్‌, షహ్రాన్‌పూర్‌, బరేలీలో గాలివాన తీవ్ర ప్రభావం చూపింది. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అధికారులను ఆదేశించారు.రాజస్థాన్‌లో బలమైన గాలులు, ఇసుకతో కూడిన తుఫాన్ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ప్రారంభమైన వర్షం 3 గంటల వరకు కొనసాగింది. భరత్‌పూర్‌ జిల్లాలో 12 మంది, ధోల్‌పూర్‌లో ఆరుగురు చనిపోయారు. అల్వార్లో నలుగురు, ఝున్‌ఝున్‌‌లో ఇద్దరు, బికనేర్‌లో ఒకరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. గాలివాన ధాటికి ఇళ్లు కూలిపోవడం వల్ల ప్రాణనష్టం అధికంగా జరిగింది.

Related Posts