YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దుర్గమ్మని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

దుర్గమ్మని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

విజయవాడ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శనివారం ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు.  సోము వీర్రాజు మాట్లాడుతూ ఏపీ ఆర్ధిక పరిస్థితి సరిగ్గా లేదు. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అమ్మవారిని వేడుకున్నా. సంక్షేమం పేరుతో దుబారా చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయలేదు.ఇవ్వని హామీలు అమలు చేస్తున్నారు. ఏపీ ఆర్ధిక పరిస్థితులు సజావుగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నా. ఏపీలో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల విషయంలో మాత్రమే పని చేస్తోంది. ముఖ్యమంత్రి ఎవరు చెప్పిన వినడం లేదు.అందుకే అమ్మవారి చెప్తే వింటారని వేడుకొన్నానని అన్నారు. సంక్షేమ కార్యక్రమంలో  తప్ప వేరే మార్గంలో వెళ్లడం లేదు. సిపియస్ రద్దు చేస్తా అని చెయ్యలేదు.కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్ చేస్తామని మాట తప్పారు. ముఖ్యమంత్రి సచివాలయం ఎందుకు వెళ్లడం లేదని అన్నారు.
పాస్టర్లకు జీతాలు ఇచ్చి చర్చిలు కట్టించదానికి ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తుంది. రాష్ట్రంలో అన్ని దేవాలయాలు సందర్శిస్తా. చంద్రబాబు ఉన్నప్పుడు ఆలయాల కూల్చివేతపై ఉద్యమం చేసిన విషయాన్ని మంత్రి వెల్లంపల్లి గుర్తు పెట్టుకోవాలి  మంత్రి వెల్లంపల్లి జ్ఞాపక శక్తి కోల్పోయారు. నాతో కలిసి ఉద్యమం చేసిన రోజులు మర్చిపోయావా. శివస్వామీ లతో  కలిసి దేవాలయాల కూల్చివేతపై నిరసన చేపట్టిన రోజులు వెల్లంపల్లి గుర్తు పెట్టుకోవాలి. గత ప్రభుత్వంలో కూల్చేసిన అన్ని గుడులు ప్రభుత్వం నిర్మించాలి. విగ్రహాలు మాయం అయితే ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చెయ్యలేదు. దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నారు. త్వరలోనే  కాపీలతీర్థం నుంచి రామతీర్థం యాత్ర చేపడతాం. శాంతియుతంగా యాత్ర చేపడతామని చెప్పిన ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా అడ్డుకుంటుందని అయన అన్నారు.

Related Posts