ప్రజల ప్రాణాల కన్నా
హైదరాబాద్ పోలీసులకు ప్రోటోకాల్ ముఖ్యం
హైదరాబాద్
ప్రజల ప్రాణాల కన్నా హైదరాబాద్ పోలీసులకు ప్రోటోకాల్ ప్రిరియరిటి ముందుంటుంది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఘటన పోలీసుల తీరుకు అద్దం పడుతోంది. మాసబ్ ట్యాంక్ వద్ద ప్రాణ పాయ స్థితిలో ఉన్న రోగిని తరలిస్తున్న అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకుంది. ఒక విఐపీ వెళుతున్నారని నలువైపుల ట్రాఫిక్ ను ఆపివేసారు. దారి ఇవ్వాల్సిందిగా వైద్యులు అంబులెన్స్ దిగి వచ్చి విధి నిర్వహణ లో పోలీసులను బతిమిలాడినా లాభం లేకుండాపోయింది. వారిని ట్రాఫిక్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ప్రోటోకాల్ పేరుతో ట్రాఫిక్ ను స్తంభింప చేసిన పోలీసుల తీరుపై ప్రజలు మండి పడుతున్నారు. డ్యూటీవో వున్న ఒక ఏసీపీ స్థాయి అధికారి వెళుతున్న విఐపీ ఎవరో నాకు తెలియదని చెప్పడం కొసమెరుపు.