ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి.. 36 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
అమరావతి
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోని 36 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దేవీపట్నం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గండిపోశమ్మ ఆలయం వద్ద వరద నీరు మండపం పైవరకు చేరుకుంది. ఎగువ కాపర్ డ్యాంపైన ఉద్ధృతంగా ప్రవహిస్తూ పి. గొందూరుకు వరదనీరు చేరుకుంటోంది. పరిహారం అందకపోవడంతో పోలవరం నిర్వాసితులు గ్రామంలోనే బిక్కుబిక్కుమంటూ కుటుంబీకులతో కలిసి కాలం వెళ్లదీస్తున్నారు.