YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ముందుంది మొసళ్ల పండుగే

ముందుంది మొసళ్ల పండుగే

ముందుంది మొసళ్ల పండుగే
న్యూఢిల్లీ, జూలై 24,
దేశ ఆర్ధిక వ్యవస్థపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆర్ధిక సంస్కరణలు చేపట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ప్రకటన విడుదలు చేసిన మన్మోహన్.. దేశం ముందు గతుకుల మార్గం కనిపిస్తోందని, ప్రాధాన్యతలను మార్చుకోవాల్సిన సమయం అసన్నమయిందని అభిప్రాయపడ్డారు. మన్మోహన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే 1991లో సరళీకరణ విధానాలు, సంస్కరణలకు రూపకల్పన జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మన్మోహన్ ప్రకటన విడుదల చేశారు.ఇది సంతోషించాల్సిన సందర్భం కాదు.. ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం.. 1991 నాటి సంక్షోభం కన్నా ప్రమాదకర పరిస్థితులు గోచరిస్తున్నాయి.. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు ఆరోగ్యం, గౌరవంతో బతికే విధంగా ప్రాధాన్యతలను మార్చుకోవాల్సి ఉంది.. 30 ఏళ్ల కిందట ఇదే రోజున కాంగ్రెస్‌ పార్టీ కీలకమైన ఆర్థిక సంస్కరణలు చేపట్టి, కొత్త మార్గాన్ని ఏర్పాటు చేసింది.. తరువాత వచ్చిన ప్రభుత్వాలన్నీ ఈ మార్గాన్నే అనుసరించాయి. దాంతో దేశం మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి సిద్ధమయింది.అన్నింటి కన్నా ముఖ్యంగా దేశంలోని 30 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు.. యువతకు కోట్లాది ఉద్యోగాలు దక్కాయి.. స్వేచ్ఛాయుత వ్యాపారానికి ప్రోత్సాహం లభించడంతో ప్రపంచస్థాయి సంస్థలు వచ్చాయి.. దాంతో చాలా రంగాల్లో భారత్‌ ప్రపంచస్థాయి శక్తిగా ఎదిగింది. దేశ ఆర్థిక రంగం సాధించిన ప్రగతికి గర్వపడుతున్నా కరోనా కారణంగా కోట్లాది మంది నష్టపోవడం బాధాకరం... ఆర్థిక వృద్ధికి అనుగుణంగా వైద్య, విద్యా రంగాలు ప్రగతి సాధించకపోవడం దురదృష్టకరం’’ అని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్‌లోని సహచరులతో కలిసి ఆర్ధిక సంస్కరణల విధానంలో భాగస్వామ్యం కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను.. కానీ, కరోనా కారణంగా ఆర్ధిక వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్లడం విచాకరమని అన్నారు. ‘1991లో ఆర్థిక మంత్రిగా విక్టర్ హ్యూగోను ఉటంకిస్తూ నా బడ్జెట్ ప్రసంగాన్ని ముగించాను.. భూమిపై ఏ శక్తి అయినా ఎవరికి సమయం వచ్చిందనే ఆలోచనను ఆపదు... 30 ఏళ్ల తరువాత ఒక దేశంగా రాబర్ట్ ఫ్రాస్ట్ కవితను మనం గుర్తుంచుకోవాలి.. ‘అయితే వాగ్దానాలను నిలుపుకునే ముందు అనేక మైళ్లు ప్రయాణించాలి’ అని సింగ్ అన్నారు.

Related Posts