YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అమరావతి ప్రాంతానికి 200 కోట్లు

అమరావతి ప్రాంతానికి 200 కోట్లు

అమరావతి ప్రాంతానికి 200 కోట్లు
విజయవాడ, జూలై 24,
రాజధాని అమరావతి ప్రాంతానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. అమరావతి ప్రాంతంలోని బకింగ్‌ హామ్‌ కెనాల్‌ రోడ్‌ను రూ. 200 కోట్లతో నాలుగు లైన్లుగా మార్చడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆమోదం తెలిపారని మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి (ఆర్కే) తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఆర్కే శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో జరగబోయే అభివృద్ధి పనులను వివరించారు. తెనాలి నుంచి మంగళగిరి నేషనల్ హైవే రోడ్డు వరకు నిర్మించబోయే రోడ్డుకు త్వరలో టెండర్లు ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు.తమ నియోజకవర్గంలో దుగ్గిరాల మండలంలో 18 గ్రామాల్లో రూ. 70 కోట్ల నుంచి రూ. 80 కోట్లతో తాగు నీటి సౌకర్యం ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు. దుగ్గిరాల మండలాన్ని రూ. 400 కోట్లతో అభివృద్ధి చేయడానికి ఆమోదం తెలిపిన సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. అటు, మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోనూ ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆమోదం తెల‌పారని చెప్పారు.రాజధాని అమరావతిని విశాఖపట్నం తరలించడానికి జగన్ సర్కారు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమరావతి ప్రాంతాన్ని సీఎం జగన్ నిర్లక్ష్యం చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు సీఎం జగన్ ఆమోదం తెలపడం విశేషం.

Related Posts