YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కౌలు రైతులకు రైతు బంధు అమలు చేయాలి

కౌలు రైతులకు రైతు బంధు అమలు చేయాలి

కౌలు రైతులందరికీ రైతుబంధు పథకం  అందేలా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట రైతు సంఘాల నాయకులు డియాండ్ చేశారు. హైదరాబాద్ లోని  మఖ్ దూమ్ భవన్ లో జరగిన రైతు సంఘ నాకులు సమావేశంలో  రాష్ట్ర రైతు సంఘం నాయకురాలు పద్మ తోపాటు.. వివిధ రైతు సంఘాల నాయుకులు పాల్గొన్నారు. 

వాయిస్: తెలంగాణ ప్రభుత్వం రైతు సమస్యలను నిర్వీర్యం చేస్తుందుని.... రైతు సంఘ నాయకురాలు పద్మ విమర్శించారు.  స్వామినాథన్ కమిటీ సిపార్సులను  అమలు చెయ్యాలని వాటిని చట్టరూపంలో తీసుకురావాలని డియాండ్ చేశారు. రైతుల సమస్యల పై పోరాటం చేస్తామని తెలిపారు. జూన్ ఒకటో తారీఖున భద్రాచలం నుండి కరీంనగర్ వరకు రోడ్లు బ్యాక్ చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం  రైతు ఆత్మహత్యలలో దేశంలోనే రెండవ స్థానం లో ఉందని రైతు సంఘం నాయకుడు సాగర్  అన్నారు. రాష్ట్రంలో  ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు  ప్రభుత్వం  ఆరు లక్షల నష్టపరిహారం ఇస్తామని చెప్పి హామి ఇచ్చి హామీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. కేరళ తరహాలో రైతులకోసం చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.   రైతుల సమస్యలపై  పరిష్కారం కోసం అన్ని రాష్ట్ర కలక్టరేట్ లవద్ద  మే తొమ్మిదవ తారీఖున ధర్నాలు చేపట్టనున్నట్లు రైతు సంఘం నాయుకుడు సాగర్ తెలిపారు. దాంతోపాటు సంతకాల సేకరణ చేసి కలక్టర్ కు వినతి పత్రాన్ని అందించనున్నట్లు తెలిపారు.  

Related Posts