YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేటీఆర్ కుశుభాకాంక్షల వెల్లువ

కేటీఆర్ కుశుభాకాంక్షల వెల్లువ

కేటీఆర్ కుశుభాకాంక్షల వెల్లువ
హైదరాబాద్, జూలై 24, 
తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కి, బంగారు తెలంగాణ నిర్మాణ రథమెక్కి దేశం హర్షించే నేతగా, రాష్ట్రం మెచ్చిన నాయకునిగా జన నీరాజనాలు అందుకుని, తండ్రికి తగిన తనయునిగా, టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షునిగా, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖామాత్యులుగా రాణించి తెలంగాణ యువతకు ఐకన్‌గా, పార్టీ నేతలకు మార్గదర్శకులుగా, తెలంగాణ ప్రజల ముద్దుబిడ్డగా ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న కల్వకుంట్ల తారక రామునికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు వెలువెత్తున్నాయి.మంత్రి కేటీఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన వారిలో రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్, ఎంపీలు రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, మంత్రులు స‌త్య‌వ‌తి రాథోడ్, గంగుల క‌మ‌లాక‌ర్, నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జ‌గ‌దీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు హ‌రిప్రియ‌, జోగు రామ‌న్న‌, దివాక‌ర్ రావు, చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, కాలేరు వెంక‌టేశ్, క‌ల్వ‌కుంట్ల విద్యాసాగ‌ర్ రావు, మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి, చిరుమ‌ర్తి లింగ‌య్య‌, కొనేరు కోన‌ప్ప‌, రాజేంద‌ర్ రెడ్డి, చిట్టెం రామ్మోహ‌న్ రెడ్డి, గ్యాద‌రి కిశోర్ కుమార్, బాపురావు రాథోడ్, వొడితెల స‌తీష్ కుమార్, సుంకె ర‌విశంక‌ర్, భీరం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి, సైదిరెడ్డి శానంపూడి, సంజ‌య్ కుమార్, భేతి సుభాష్ రెడ్డి, పైళ్ల శేఖ‌ర్ రెడ్డి, ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర న‌ర్స‌య్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే జూప‌ల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీలు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, న‌వీన్ కుమార్, పురాణం స‌తీష్ కుమార్, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, మాజీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్, సినీ న‌టులు మంచు ల‌క్ష్మి, న‌వీన్ పోలిశెట్టితో పాటు త‌దిత‌రులు ఉన్నారు
అన్నయ్యహ్యాపీ బర్తడే
టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క‌శాఖ మంత్రి కె.తార‌క రామారావు పుట్టిన‌రోజు ఈవాళ‌. 45 వ‌సంతాలు పూర్తిచేసుకుని 46వ ప‌డిలోకి ఆయ‌న అడుగిడుతున్నారు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని కేటీఆర్ సోద‌రి, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత శుభాకాంక్ష‌లు తెలిపారు. ట్విట్ట‌ర్ ద్వారా ఆమె స్పందిస్తూ… హ్యాపీ బ‌ర్త్‌డే అన్న‌య్య‌. ఈ ఏడాది మీకు పూర్తి సంతోషాలు, విజ‌యాల‌ను తీసుకురావాల‌ని కోరుకుంటున్న‌ట్లు క‌విత‌ పేర్కొన్నారు. క‌విత శుభాకాంక్ష‌ల‌పై కేటీఆర్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ థాంక్యూ పప్పు అని హాస్య ఎమోజీని జోడించారు
సోనూసూద్ విషెస్
టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు బాలీవుడు న‌టుడు సోనూసూద్ ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. కేటీఆర్ త‌న‌కొక్క‌రికే సూప‌ర్ స్టార్ కాదు.. తెలంగాణ రాష్ర్టానికి పుట్టుక‌తోనే సూప‌ర్ స్టార్ అని సోనూసూద్ పేర్కొన్నారు. ఈ ఏడాది, వ‌చ్చే ఏడాది కూడా బాగా గ‌డ‌వాలి అని ఆకాంక్షించారు. కేటీఆర్ విజ‌న్ మిలియ‌న్ల మందికి మార్గ‌ద‌ర్శ‌క‌మ‌ని తెలిపారు. కేటీఆర్‌ను హ‌గ్ చేసుకోవాల‌ని ఆత్రుత‌గా ఉంద‌ని సోనూసూద్ చెప్పారు. సోనూసూద్ ట్వీట్‌కు కేటీఆర్ స్పందిస్తూ.. థ్యాంక్స్ చెప్పారు
నెట్ లో త్రో బ్యాక్ ఫోటోలు
సోషల్ మీడియాలో కనిపించే ‘త్రోబ్యాక్’ ఫోటోలు ప్రతీసారి నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపెట్టేందుకు జనాలు విశ్వప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలోనే కామెంట్స్, లైకుల వర్షం రావడం.. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం జరిగిపోతుంది. తాజాగా అలాంటి ఓ త్రోబ్యాక్ పిక్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.ఈ ఫోటోలో ముద్దుగా కనిపించే చిన్నారి ఇప్పుడొక బెస్ట్ పొలిటీషియన్. ప్రజల్లో యమా క్రేజ్.. పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యువత అయితే ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటారు. మరి ఆయన ఎవరో చెప్పుకోండి చూద్దాం.. చిన్న క్లూ.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఆయన బెస్ట్ ఫ్రెండ్..కనిపెట్టేసి ఉంటారు. ఆయనెవరో కాదు.. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్). ఇవాళ ఆయన పుట్టినరోజు. రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ్య సభ్యులు సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌కు విషెస్ తెలుపుతూ షేర్ చేసిన త్రోబ్యాక్ పిక్ ఇది.

Related Posts