YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

భార‌తీయులు స్వ‌స్తిక్‌ (卐) ను ఎంతో ప‌విత్ర‌మైందిగా భావిస్తారు. 

భార‌తీయులు స్వ‌స్తిక్‌ (卐) ను ఎంతో ప‌విత్ర‌మైందిగా భావిస్తారు. 

స్వస్తిక్ 卐

భార‌తీయులు స్వ‌స్తిక్‌ (卐) ను ఎంతో ప‌విత్ర‌మైందిగా భావిస్తారు. 

దేశంలో అనేక మ‌తాల‌కు చెందిన వారు దీన్ని ఆధ్యాత్మికంగా ఉప‌యోగిస్తారు. సుమారుగా 12 వేల ఏళ్ల కింద‌టి నుంచి స్వ‌స్తిక్ మ‌నుగ‌డ‌లో ఉంద‌ని చ‌రిత్ర‌కారులు చెబుతారు. కేవ‌లం మ‌న దేశం లోనే కాదు.. అనేక దేశాల‌కు చెందిన వారు స్వస్తిక్‌ ను, దాన్ని పోలిన చిహ్నాల‌ను అనేక వేల సంవ‌త్స‌రాల నుంచి ఉప‌యోగిస్తున్నారు. జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం, బుద్ధిజం, జైనిజంల‌లో, టిబెట్‌, చైనా, జ‌పాన్‌, గ్రీస్‌, అజ్టెక్‌, సెయ్లాన్‌, హోపి, సెల్ట్‌, బాలి, మాల్టా, ల్యాప్‌లాండ్ వంటి దేశాల్లో #స్వస్తిక్ చిహ్నాన్ని ప్ర‌జ‌లు వాడుతున్నారు.ఉక్రెయిన్‌ లోని మెజిన్ అనే ప్రాంతంలో ఓ ఏనుగు దంతంపై చెక్క‌బ‌డిన ప‌క్షి బొమ్మ‌లో స్వ‌స్తిక్ చిహ్నాన్ని గుర్తించారు. అది సుమారుగా 13 వేల ఏళ్ల కింద‌టిద‌ని నిర్దారించారు. సంస్కృతంలో సు అంటే మంచి, శుభం అని అర్థాలు వ‌స్తాయి. అలాగే అస్తి అంటే క‌లుగు గాక అని అర్థం వ‌స్తుంది. రెండింటినీ క‌లిపితే సు + అస్తి = స్వ‌స్తి గా మారుతుంది. అంటే మంచి ఆరోగ్యం లేదా శుభం క‌లుగుతుంది అని అర్థం అన్న‌మాట‌. అందుక‌నే ఈ చిహ్నం త‌మ‌కు అన్ని విధాలుగా మంచి చేస్తుంద‌ని చెప్పి అనేక మంది దీన్ని వాడ‌డం మొద‌లు పెట్టారు.స్వ‌స్తిక్ చిహ్నంలో ఉండే నాలుగు శాఖ‌లు ప్ర‌కృతి పున‌ర్జ‌న్మ‌ను సూచిస్తాయి. అంటే జీవుల పుట్టుక‌, మ‌ర‌ణం ఒక‌దాని త‌రువాత ఒక‌టి నిరంత‌రాయంగా జ‌రుగుతుంద‌ని అర్థం. స్వ‌స్తిక్ చుట్టూ వృత్తాన్ని గీస్తే వ‌చ్చే చిహ్నం సూర్యున్ని ప్ర‌తిబింబిస్తుంది. అది కాంతికి జ‌న్మ‌స్థానంగా చెప్ప‌బ‌డుతుంది. అది విశ్వంలో న‌లువైపులకు వ్యాపిస్తుంది. స్వస్తిక్ గుర్తు సప్త రిషి మండలం వాటి స్థితి గతులు ఆధారంగా ఏర్పడింది అని నానుడి. స్వ‌స్తిక్‌ కు ఉండే నాలుగు రేఖ‌లు నాలుగు దిక్కుల‌ను కూడా సూచిస్తాయి. ఉత్త‌రం, ద‌క్షిణం, తూర్పు, ప‌డ‌మ‌ర దిక్కుల‌ను అవి సూచిస్తాయి. స్వ‌స్తిక్ మ‌ధ్య‌లో ఉండే స్థానం హిందూ దైవం విష్ణువును సూచిస్తుంది. విష్ణువు నాభిలో నుంచి బ్ర‌హ్మ పుట్టాడు. అందువ‌ల్ల స్వ‌స్తిక్ మ‌ధ్య స్థానం నుంచి విశ్వం ఆవిర్భ‌వించి విస్త‌రించింద‌ని చెబుతారు. స్వ‌స్తిక్ మ‌ధ్య భాగాన్ని దైవానికి ప్రతీక అని భావిస్తారు. స్వ‌స్తిక్ చిహ్నంలో ఒక రేఖ‌ను బ్ర‌హ్మదేవుడిగా భావిస్తారు. మ‌రొక రేఖ‌ను నాలుగు వేదాల‌ని చెబుతారు. మ‌రొక రేఖ‌ను నాలుగు పురుషార్థాల‌ని భావిస్తారు. ఇంకో రేఖ‌ను పౌరులు పాటించాల్సిన ఆశ్ర‌మ ధ‌ర్మాల‌ని చెబుతారు..

వేదాలు నాలుగు – రుగ్వేదం, సామ‌వేదం, య‌జుర్వేదం, అథ‌ర్వ‌ణ వేదం. 

పురుషార్థాలు కూడా నాలుగు – ధ‌ర్మ‌, అర్థ‌, కామ‌, మోక్షాలు. 

ఆశ్ర‌మ ధ‌ర్మాలు కూడా నాలుగు – బ్ర‌హ్మ‌చ‌ర్య‌, గృహ‌స్థ‌, వాన‌ప్ర‌స్థ‌, స‌న్యాస ధ‌ర్మాలు…

బౌద్ధులు స్వ‌స్తిక్ చిహ్నాన్ని ప్ర‌తిభా పాట‌వాల‌కు, నైపుణ్యానికి చిహ్నంగా భావిస్తారు. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, అమెరికా దేశాల్లో స్వస్తిక్ చిహ్నాన్ని ఆధ్యాత్మిక‌త‌కు చిహ్నంగా ఉప‌యోగిస్తారు. నొవాజో అనే ఓ తెగ‌కు చెందిన వారు స్వ‌స్తిక్ చిహ్నాన్ని అనారోగ్యాల‌ను న‌యం చేసేందుకు నిర్వ‌హించే ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాల్లో వాడుతారు.మ‌న దేశంలో ఆర్యులు జ‌ర్మ‌నీ దేశానికి చెందిన పూర్వీకులు అని హిట్ల‌ర్ న‌మ్మేవాడు. అందుక‌నే మ‌న దేశంలో ఎక్కువ‌గా ఉప‌యోగించే స్వ‌స్తిక్ చిహ్నాన్ని హిట్ల‌ర్ త‌న నాజీ సైన్యం చిహ్నంగా ఉప‌యోగించాడ‌ని చెబుతారు. ఇక స్వ‌స్తిక్ చిహ్నాన్ని అనేక ర‌కాలుగా ప్ర‌స్తుతం అనేక మంది వాడుతున్నారు. వాటిల్లో రెండు ర‌కాలు ప్ర‌ధానంగా ఉన్నాయి..ఎడ‌మ వైపుకు తిరిగి ఉండే లేదా ఎడ‌మ చేతి వాటం స్వ‌స్తిక్ చిహ్నం (卍) ఒక‌టి.. కుడి వైపు తిరిగి ఉండే లేదా కుడి చేతి వాటం స్వ‌స్తిక్ చిహ్నం (卐) ఒక‌టి. కుడి వైపుకు తిరిగి ఉండే స్వ‌స్తిక్ చిహ్నాన్ని చాలా మంది ఉప‌యోగిస్తారు..

Related Posts