శ్రీ కృష్ణపరమాత్మ.
కృష్ణపరమాత్మ ఆది శంకరాచార్యుల అవతారముకు పూర్వము , దైవము మానుషరూపేన అనే ఆర్యోక్తి నిజమయ్యేటట్లు బ్రతికి చూపినవాడు శ్రీకృష్ణపరమాత్మ .
తంత్ర ,మంత్ర ,మహిమాసిద్ధులకు అధిష్టానదేవత దుర్గాదేవి ...అందుకే, స్వామి వారిని దుర్గాదేవి ప్రతిరూపంగా కూడా కొంతమంది సిద్ధులు ,మునిపుంగవులు అభిప్రాయపడతారు.అందుకని క్రిష్ణులవారు బ్రతికినట్టు మనం బ్రతకలేము ,రాముడు బ్రతికినట్టు బ్రతకవచ్చు.. కాని కృష్ణుడు జీవించినట్లు మనం జీవిన్చలేము అందుకని స్వామి వారు ఎలా బ్రతుకుతే వారి అనుగ్రహం కలుగుతుందో ఉపదేశం చేసారు అదే గీతాసారము .అందులో విశ్వరూపసందర్శనయోగం అనే అధ్యాయం లో 'అహం బ్రహ్మాస్మి ' అనే తత్వము ఉట్టిపడే విధంగా అభయమిచ్చారు స్వామివారు.
కాని.. కృష్ణుల వారు కూడా తనకున్న ప్రతి భార్యకు 100 మంది వరకు సంతానము ప్రసాదించమని శివుని గూర్చితీవ్ర తపస్సు చేసినట్లు ఐతేహాసముల యందు స్పష్టంగా ఉన్నది.
ఒక యుగము అంతమయ్యి, మరో యుగము ప్రపంచమును ఆక్రమించే సమయం ఆసన్నమైనప్పుడు తప్పకుండ తీవ్రమైన భీభత్సము జరుగుతుంది ..దానిని ఆపడము ఎవరి తరము కాదు ఎందుకంటే అది కాలము యొక్క సహజ నైజము.కాని,.. భగవంతుడు ధర్మస్వరూపుడు కాబట్టి ఇంతటి ప్రళయ సమయంలో కూడా ధర్మమును కాపాడవలసిన బాధ్యతను అనుసరించి తనను తాను సశరీరంగా అవిష్కరించుకోడం జరుగుతుంది. అట్టి ఆవిష్కారమే కృష్ణ జన్మం .కాని,.. కలిలో చంచలత్వం ఎక్కువ .మంచి ,చెడు ఒకే మనిషిలో తాండవం చేస్తున్నాయి.శ్రీకృష్ణుడు వధించిన వారిలో అతి బలవంతులు మరియు అతిపాపాత్ములు ,
ఆ రోజుల్లో చాలా ప్రఖ్యాతి గల వారు 4 గురు ఉన్నారు .కంసుడు ,జరాసంధుడు ,శిశుపాలుడు ,దుర్యోధనుడు.వీరిలో కంసుడు ,శశిపాలుడు - వీరిద్దరిని కృష్ణుడే స్వయంగా చంపాడు ..కానీ విచిత్రమేమంటే జరాసంధుని చే అనేకమార్లు కృష్ణుని రాజ్యము ఓటమిపాలైంది ,వానికి అతివిచిత్రమైన వరాలు ఉండటము దీనికి ప్రధానమైన కారణము ..కావున మిగిలిన ఇద్దరినీ ,. హనుమ తమ్ముడైన భీముని చే వధింపచేసారు స్వామి.కానీ, నేటి కాలం లో పొద్దున్న ధర్మరాజులా వుండే వాడికి రాత్రికల్లా దుర్యోధన -కీచక వంటి వారి ఆలోచనలు వస్తాయి-చంపుతూపోతే ఒక్కడూ మిగిలే అవకాశము లేదు కాబట్టి ఈ యుగం లో మనసులని మార్చడమే కానీ మనుషుల్ని చంపడం సరికాదు.మనసు మారకుండా ఉండాలంటే ధర్మమార్గమును పదేపదే ఎవరైనా చెబుతూ ఉండాలి లేక మనమే మననం చేస్తూ ఉండాలి ,..ఈ కారణంగానే అనేక మంది గురువులు ఈ రోజుల్లో పుడుతున్నారు..., భోధన చేస్తున్నారు...