కర్నూలు, జూలై 26,
వైసీపీ నేతలను పదవులు ఊరిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాలను ప్రభుత్వం తనవైపు ఆకర్షించే పనిలో భాగంగా.. ఇటీవల కాలంలో బీసీలకు ఎక్కువగా పదవులు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఈ సామాజిక వర్గాలకు చెందిన వారు ఇప్పుడు పదవుల జాబితాలో ముందున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో టికెట్లు ఆశించి, భంగపడిన బీసీ నాయకులు ఇప్పుడు నామినేటెడ్ పదవులైనా దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఇలాంటివారిలో కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక పేరు మరోసారి వినిపిస్తోంది.వాస్తవానికి ఎప్పుడు నామినేటెడ్ కోటా పోస్టుల భర్తీ తెరమీదికి వచ్చినా.. బుట్టా రేణుక పేరు ఎప్పుడూ వినిపిస్తోంది. గతంలో రాజ్యసభ సీట్ల భర్తీ సమయంలోనూ ఆమె స్వయంగా వచ్చి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి వెళ్లారు. అయితే అప్పట్లో ఈ క్వేషన్లు కుదరలేదు. దీంతో ఆమెకు అవకాశం లభించలేదు. ఇక, ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనున్న నేపథ్యంలో ఆమె మరోసారి తన ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. కర్నూలుకు చెందిన సీనియర్ నాయకుడి ద్వారా బుట్టా రేణుక పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.ప్రస్తుతం స్థానిక సంస్థల కోటాలో మొత్తం 11 ఎమ్మెల్సీ స్తానాలను భర్తీ చేయాల్సి ఉంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై హైకోర్టు స్టే ఉన్న నేపథ్యంలో అది తొలిగిపోయి పరిషత్ కార్యకలాపాలు ప్రారంభం కాగానే .. ఎమ్మెల్సీల ఎన్నికకు మార్గం సుగమమం అవుతుంది. అయితే.. ఇది ఎప్పుడు తేలుతుందనేది తెలియకపోయినా.. నాయకులు మాత్రం ముందుగానే సీట్లను రిజర్వ్ చేసుకుంటున్నారు. తూర్పు గోదావరిజిల్లాకు చెందిన ఒక ఇద్దరు కూడా ఇలానే సీట్లు రిజర్వ్ చేసుకున్నారని.. అదేవిధంగా మరో సీనియర్ నేత దాడి వీరభద్రరావు కూడా రిజర్వ్ చేసుకున్నారని.. వైసీపీలో గుసగుస వినిపిస్తోంది.ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా..బుట్టా రేణుక కు ఈ దఫా అయినా.. అవకాశం చిక్కుతుందో లేదో చూడాలి. 2014 ఎన్నికల్లో కర్నూలు నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన ఆమె ఆ తర్వాత టీడీపీ చెంత చేరిపోయారు. గత ఎన్నికలకు ముందు ఆమె తిరిగి వైసీపీలోకి వచ్చినా అప్పటికే ఆసల్యం అవ్వడంతో ఆమెను జగన్ పట్టించుకోలేదు. ఆ తర్వాత బుట్టా రేణుక పార్టీలో పదవి, ప్రాధాన్యత కోస ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా జగన్ కనికరించడం లేదు. తాజాగా జగన్ కడప జిల్లా నుంచి బీసీ ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కర్నూలు జిల్లా నుంచి బీసీ + మహిళ కోటాలో కనికరిస్తారన్న ఆశతో ఆమె ఉన్నారు.