రాజమండ్రి
తూర్పుగోదావరి జిల్లా చింతూరు మన్యంలోని మావోయిస్ట్ ప్రభావిత గ్రామాల్లో మావోలకు వ్యతిరేకంగా ఆదివారం సాయంత్రం బ్యానర్లు కనిపించాయి. ఈ బ్యానర్లు మండలంలోని పేగ, అల్లిగూడెం, సూరకుంట గ్రామాల్లో అల్లూరి ఆదివాసీ సమితి పేరుతో బ్యానర్లు వుండడం కలకలం రేపాయి. ఈ బ్యానర్లలో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కోసం రోడ్లు వేస్తుంటే గుత్తేదారుల నుండి డబ్బులు వసూళ్ళు చేసి వారి వాహనాలను తగలబెట్టడం ఇవేనా మీరు ప్రజలకు చేసే న్యాయం ?అని మావోలను ప్రశ్నిస్తూ ఉన్నాయి. అభివృద్ధికి ఆటంకంగా మారడమేనా మావోయిస్టుల సిద్ధాంతమా ? అని వ్రాసి ఉన్నాయి. ఈ నెల 28 వ తేది నుండి ఆగష్టు 3 వ తేదీ వరకు మావోయిస్టుల వారోత్సవాలు ఉన్న నేపథ్యంలో ఈ బ్యానర్లు వెలవడం గమనార్హం...