YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గులాబీ సైన్యం... సర్వం సిద్ధం

గులాబీ సైన్యం... సర్వం సిద్ధం

హైదరాబాద్, జూలై 26, 
తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ ఐదు సార్లు ఉప ఎన్నికలు జరిగాయి. ఆరో సారి హుజూరాబాద్ నియోజకవర్గంలో జరగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపే థ్యేయంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పావులు కదుపుతున్నారు. సర్వ సైన్యాన్ని హుజూరాబాద్ లోనే మొహరిస్తున్నారు. కులాల వారీగా నేతలను అక్కడ ఇప్పటికే ఇన్ ఛార్జులుగా నియమించారు. గ్రామాల వారీగా ఎమ్మెల్యేలను ఇన్ ఛార్జులుగా నియమించారు కేసీఆర్.ఇక మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్ లు హుజురాబాద్ ఉప ఎన్నికల వ్యూహరచనను ఎప్పటికప్పుడు చేస్తున్నారు. ఈటల రాజేందర్ వర్గాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పనిచేస్తుంది. ఈటల రాజేందర్ ను మానసికంగా దెబ్బతీయాలంటే ఆయన ప్రధాన అనుచరులను తమ వైపునకు తిప్పుకోవాలన్నది కేసీఆర్ ఆలోచన. ఈటల రాజేందర్ ను ఒంటరి చేయగలిగితే ముందుగానే గెలుపు పిలుపు విన్పిస్తుందన్నది కేసీఆర్ ప్లాన్. ఇందుకు అనుగుణంగానే ఈటల రాజేందర్ వెంట ఉండే ముఖ్యమైన నేతలను టీఆర్ఎస్ నేతలు ఆకర్షించే పనిలో పడ్డారు. ఏ సామాజికవర్గమైతే ఆ సామాజికవర్గం మంత్రి వారిని పార్టీలోకి తెచ్చేందుకు రంగంలోకి దిగారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే బీజేపీతో పాటు ఈటల రాజేందర్ ను వీక్ చేయాలన్న వ్యూహంతో ఆపరేషన్ హుజూరాబాద్ ను కేసీఆర్ ప్రారంభించారనే చెప్పాలి. అభివృద్ధి పనులతో పాటు నేతలను చేర్చుకోవడమే మరో మూడు నెలల ప్రక్రియ.టీఆర్ఎస్ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ ఐదు ఎన్నికలు జరిగాయి. 2014 తర్వాత పాలేరు, నారాయణఖేడ్ కు ఎన్నికలు జిరిగాయి. ఈ రెండు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలయినా టీఆర్ఎస్ విజయం సాధించింది. 2018 లో అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూర్ నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్ లో ఉప ఎన్నికలు జరిగాయి. దుబ్బాక సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ కోల్పోయినా, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలైన సాగర్, హుజూర్ నగర్ లో విజయం సాధించింది. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక ఆరోది. ఇక్కడ కూడా గెలిచి సత్తా చాటాలన్న లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారు.

Related Posts