YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

సీనియర్ నటి జయంతి కన్నుమూత

సీనియర్ నటి జయంతి కన్నుమూత

బెంగళూరు
దక్షిణాది చలన చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూశారు.  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.  ఇటీవల స్వాస సంబంధిత సమస్యతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో  చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో 76 ఏండ్ల జయంతి తన స్వగృహంలో కన్నుమూశారు. తెలుగు, మరాఠీ, తమిళం, కన్నడ, మళయాళం చిత్రాల్లో నటించారు. 1945 జనవరి 6 న బళ్లారిలో  జన్మించిన జయంతి అసలు పేరు కమలకుమారి దాదాపు 500 చిత్రాల్లో ఆమె నటించారు. ఏడు సార్లు కర్నాటక ప్రభుత్వ అవార్డులు, నాలుగు సార్లు ఉత్తమ నటి అవార్డు, రెండు సార్లు ఉత్తమ సహాయ నటి పురస్కారాలు,  రెండు ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నారు. అభినయ శారద బిరుదుకుడా ఆమె సొంతం. నటుడు పేకేటి శివరాంను ఆమె వివాహమాడారు. తెలుగు చలనచిత్ర రంగంలో ఆగ్ర నటులు అక్కినేని  నాగేశ్వరరావు , ఎన్టీఆర్, కృష్ణ నటించిన చాలా సినిమాల్లో ఆమె నటించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు వంటి హీరోలకు తల్లిగా నటించారు. ఇక శాండల్ వుడ్  కన్నడలో  జయంతి నెంబర్ వన్ హీరోయిన్గా రాణించారు. అక్కడ రాజ్కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్ వంటి అగ్ర నటుల సినిమాల్లో హీరోయిన్గా నటించారు.  జయంతి మృతిపట్ల సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. పలువురు సోషల్ మీడియా వేదికగా జయంతి మృతికి సంతాపం వ్యక్తం చేసారు.

Related Posts