YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా

ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా

బెంగళూరు జూలై 26,

ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా రాజీనామాకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం రాజీనామా చేయటంలో తనపై ఎవరి ఒత్తిడి లేదు:యడ్డి.
సీఎం పదవికి ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప రాజీనామా చేసారు. నేటి మధ్యాహ్నం రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చేయటంలో తనపై ఎవరి ఒత్తిడి లేదని,  మరొకరికి అవకాశం కల్పించేందుకు రాజీనామా చేశానని యడియూరప్ప స్పష్టం చేశారు. 75 ఏళ్ల తర్వాత కూడా నాకు అవకాశం ఇచ్చారు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కర్ణాటక ప్రజలకు రుణపడి ఉంటా. గవర్నర్‌కు రాజీనామా ఇచ్చి ఆమోదించాలని కోరా. ప్రధాని మోదీ, జేపీ నడ్డాకు కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో కూడా బీజేపీకి పూర్తి సహకారం అందిస్తాం. నేను ఎవరి పేరును సిఫార్సు చేయలేదు. అధిష్టానం ఎవరి పేరు సూచించినా సహకరిస్తా. కర్ణాటకలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తా’’నని అన్నారు.కాగా, కర్ణాటక కొత్త సీఎం ఎంపికపై బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. కర్ణాటక నూతన సీఎం ఎంపిక పరిశీలకుడిగా ధర్మేంద్ర ప్రధాన్‌ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి రేసులో ప్రహ్లాద్ జోషి, సీటీ రవి, ముర్గేష్ నిరాణి, బసవరాజ్‌ ఉన్నారు. రేపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో.. కర్ణాటక నూతన సీఎం పేరు ఖరారు చేసే అవకాశం ఉంది.
రాజీనామాకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం
కాగా  క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బీఎస్ యెడియూర‌ప్ప రాజీనామాకు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ తావ‌ర్‌చంద్ గెహ్లాట్ ఆమోదం తెలిపారు. అయితే, త‌దుప‌రి ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకారం చేసేవ‌ర‌కు రాష్ట్రానికి కేర్ టేక‌ర్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించాల‌ని ఆయన సూచించారు. క‌ర్ణాట‌కకు నాలుగోసార్లు ముఖ్య‌మంత్రిగా పనిచేసిన యెడియూర‌ప్ప.. నాలుగోసారి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి ఇవాళ్టికి స‌రిగ్గా రెండు సంవ‌త్స‌రాలు పూర్త‌య్యింది.ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఈ ఉద‌యం గ‌వ‌ర్న‌ర్ తావ‌ర్‌చంద్ గెహ్లాట్‌ను క‌లిసి త‌న రాజీనామా లేఖ‌ను అంద‌జేశారు. వెంట‌నే ఆయ‌న యెడ్డీ రాజీనామాకు ఆమోదం తెలుపుతూ.. కొత్త ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేసేవ‌ర‌కు కేర్ టేక‌ర్ బాధ్య‌త‌లు నిర్వ‌హించాల‌ని సూచించారు. కాగా, బీజేపీ జాతీయ‌ నాయ‌క‌త్వం, రాష్ట్ర నాయ‌క‌త్వం చ‌ర్చించి కొత్త ముఖ్య‌మంత్రిని ఖ‌రారు చేసే అవ‌కాశం ఉన్న‌ద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Related Posts