కోల్‌కతా జూలై 26
పెగాసస్ స్పైవేర్ వివాదంపై విచారణకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఇందులో రిటైర్డ్ జడ్జ్‌లు జస్టిస్ ఎంవీ లోకూర్, జస్టిస్ జ్యోతిర్మయ్ భట్టాచార్య ఉన్నారు. ఈ ప్యానెల్ రాష్ట్రంలో పెగాసస్ ఫోన్ హ్యాకింగ్‌లపై విచారణ జరపనుంది. ఈ ఫోన్ హ్యాకింగ్‌కు గురైన వాళ్ల జాబితాలో మమత మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కూడా ఉన్నారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో మమతా దీనిపై విచారణకు ఆదేశించడం గమనార్హం. ఫోన్ హ్యాకింగ్, దానిని ఎలా చేశారన్నదానిపై విచారణ జరగాలి. ఇది ఇతరులను కూడా మేల్కొల్పుతుందని భావిస్తున్నాను. దీనిపై న్యాయమూర్తులు సాధ్యమైనంత త్వరగా విచారణ ప్రారంభించాలి. బెంగాల్‌లో చాలా మంది ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయి అని ఆమె అన్నారు.