YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి ఏబీవీపీ జాతీయ కార్యవర్గం డిమాండ్

ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి  ఏబీవీపీ జాతీయ కార్యవర్గం డిమాండ్

నెల్లూరు
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా అరకొర ఉద్యోగుల జాబ్ క్యాలెండర్ తో నిరుద్యోగులను జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ పేర్కొన్నారు.అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి నాయుడుపేట, సూళ్లూరు పేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక నాయుడుపేట ఆర్డిఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నూతన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు . నిరుద్యోగ యువత భవిష్యత్తు లతో చెలగాటం ఆడవద్దని, నిర్దిష్టమైన ప్రణాళికలతో ఉద్యోగాలను భర్తీ చేసే విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకోవాలని కోరారు. లక్షలు ఇస్తామని ఉద్యోగాలు వేల సంఖ్యలో కూడా ఇవ్వక పోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సులూరుపేట నాయుడుపేట ఏబీవీపీ  సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts