రైతు చట్టాలకు వ్యతిరేకంగా ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు వచ్చిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ జూలై 26
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఆ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆయన ఇవాళ పార్లమెంట్‌కు ట్రాక్టర్‌పై వచ్చారు. రైతుల సందేశాలను పార్లమెంట్‌కు మోసుకువచ్చినట్లు రాహుల్ తెలిపారు. రైతు గొంతును ప్రభుత్వం నొక్కిపెడుతోందని ఆరోపించారు. పార్లమెంట్‌లో రైతు చట్టాలపై చర్చ జరగకుండా అడ్డుకుంటోందన్నారు. ఆ నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. కొత్త సాగు చట్టాలు కేవలం ఇద్దరు, ముగ్గురు వ్యాపారవేత్తలకు మాత్రమే ప్రయోజనకరంగా ఉన్నట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ సర్కార్ తెచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే.