YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

ఎంత పెద్ద ఆపద వచ్చినా మీ వెంటే ఉండి కాపాడుతా: స్వర్ణలత భవిష్యవాణి

ఎంత పెద్ద ఆపద వచ్చినా మీ వెంటే ఉండి కాపాడుతా: స్వర్ణలత భవిష్యవాణి

ఎంత పెద్ద ఆపద వచ్చినా మీ వెంటే ఉండి కాపాడుతా: స్వర్ణలత భవిష్యవాణి
హైదరాబాద్‌ జూలై 26
ఎంత పెద్ద ఆపద వచ్చినా మీ వెంటే ఉండి కాపాడుతానన్నారు మాతంగి స్వర్ణలత భవిష్యవాణి.సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆలయంలో రంగం సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. మహమ్మారితో ఎన్ని కష్టాలు వచ్చినా సంకోచించకుండా ఉత్సవాలను వైభవంగా నిర్వహించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. భక్తులు సంతోషంగా ఉండే విధంగా చూసుకొనే బాధ్యత తనదేనని, కరోనా మహమ్మారి ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టిందని, వర్షాలతో రైతులు కొంత ఇబ్బందులు పడతారన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భక్తులు తనను నమ్మి పూజలు చేశారని, వారిని కాపాడే బాధ్యత తనదేనని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ హాజరయ్యారు. సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు
 

Related Posts