జగన్ బెయిల్ కేసు ..30వ తేదీకి వాయిదా
హైదరాబాద్, జూలై 26,
ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. లిఖితపూర్వక వాదనలు వినిపించేందుకు సీబీఐ మరింత సమయం కోరింది. దీంతో విచారణ ఈ నెల 30కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది. రఘురామ కృష్ణంరాజు, జగన్ తరపు లాయర్లు ఇప్పటికే తమ వాదనలను కోర్టుకు లిఖితపూర్వకంగా సమర్చించారు. విచక్షణ మేరకు చట్ట ప్రకారం పిటిషన్‌లోని అంశాలపై నిర్ణయం తీసుకోవాలని సీబీఐ గతంలో కోర్టుకు వివరించింది.మరోవైపు తాము కూడా లిఖితపూర్వకంగా వాదనలు సమర్పిస్తామని.. పది రోజుల సమయం ఇవ్వాలని ఈ నెల 14న కోర్టును సీబీఐ కోరింది. అంగీకరించిన కోర్టు నేటికి వాయిదా వేయగా.. ఇవాళ మరోసారి సీబీఐ సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ పిటిషన్ అర్హతపై కోర్టులో వాదనలు జరిగాయి.. తర్వాత కోర్టు విచారణకు స్వీకరించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 11 చార్జ్ షీట్లను సీబీఐ నమోదు చేసిందని ఎంపీ రఘురామ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతి చార్జ్‌షీట్‌లో జగన్ ఏ-1గా ఉన్నారని.. రఘురామ జగన్‌పై నమోదైన కేసులను త్వరగతిన విచారణ పూర్తి చేయాలని పిటీషన్‌లో ప్రస్తావించారు. సీఎం జగన్ నిర్దోషిలా బయటపడాలన్నదే తన ఉద్దేశమని ఎంపీ రఘురామ అన్నారు. వైఎస్సార్‌సీపీని రక్షించుకునే బాధ్యత ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడిగా తనపై ఉందన్నారు.