YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన.

కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన.

కర్మలు చేయుటయందే నీకు అధికారం. ఫలితాన్ని ఎప్పుడూ కోరవద్దు. ఫలాలు కోరేవాడు పిసినిగొట్టు - కృపణా ఫల హేతవః - అని అన్నారు. ఇది భగవద్గీత సారమేగాదు. అది చెప్పిన భగవానుని జీవితసారం కూడా ఇదే...

దేవకీ వసుదేవులకు జన్మించినా తల్లిదండ్రుల వాత్సల్యాన్ని కోరలేదు. నంద గోకులంలో వెన్న దొంగిలించినా తనకోసం కాదు, స్నేహితులకు కోతులకు పెట్టేవాడు. కంసుని చంపినా రాజ్యాధికారాన్ని  కోరలేదు,  ఉగ్రసేనునికే కట్టబెట్టాడు. జరాసంధుని చంపించినా రాజ్యాన్ని అతడి కుమారునిడినే పట్టాభిషిక్తుని చేశాడు. శిశుపాలుని వధించినా అతని కుమారుడు దృష్టకేతువుకే రాజ్యాన్ని అప్పగించాడు. నరకుని చంపి అతని కుమారుడు భగదత్తునినే రాజుగా చేశాడు. దంతవక్త్రుని చంపి అతడి రాజ్యాన్ని అతని కుమారునికే ఇచ్చాడు పౌండ్రక వాసుదేవుని చంపి అతని కుమారుడినే రాజ్యాభిషిక్తుని చేశాడు. దుర్మార్గుడైన దుర్యోధనుడు సాయం కోరితే తన సైన్యం మొత్తాన్ని త్యాగం చేశాడు. నాకేం ఇస్తావు? అని అడగలేదు. పాండవులకు ఎంతమేలు చేసినా, యుద్ధం లో ఎంత సాయపడినా తానేమీ ఫలితాన్ని కోరలేదు. రాజ్యంలో వాటా కోరలేదు. రథన్ని తోలేపని అప్పగించినా అప్పగించిన పనిని శ్రద్ధగా - సక్రమంగా నిర్వర్తించాడే గాని ఏ ఫలితాన్ని ఆశించలేదు. ఇంత చిన్నపనియా? అనలేదు ఆయన ఏపని చేసినా, ఆ పనిని సక్రమంగా నిర్వర్తించటమే గాని కర్మఫలంపై ఏమాత్రం ఆసక్తి లేదు. దేనినీ కోరలేదు. మరి మనం మాత్రం ఏఫలితం లేకుండా ఎందుకు కర్మలు చేయాలి అంటాం కదా? సూర్యుడు వెలుగునిచ్చి నీవద్ద నుండి ఏం కోరుతున్నాడు? వాయుదేవుడు గాలినిచ్చి నీ ప్రాణాన్ని నిలబెడుతూ ఏం కోరుతున్నాడు? నదులు నీటిని ఇచ్చి దప్పిక తీర్చి నీనుండి ఏమి కోరుతున్నాయి? భూమి నీకు ఆధారంగా ఉండి, పంటల నిచ్చి ఏమి కోరుతున్నది? చెట్లు ఫలాలను, పుష్పాలను, నీడను ఇచ్చి ఏమి కోరుతున్నాయి? చంద్రుడు చల్లదనాన్నిచ్చి ఏమి కోరుతున్నాడు? మన సమస్త ఇంద్రియాలకు శక్తి నిచ్చి పరమాత్మ ఏమి కోరుతున్నాడు? అందుకే  కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన - భగవద్ వాక్యాన్ని పాటించడానికి వీలైనంత కృషి చేద్దాం.. 

Related Posts