YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఆగని పెగాసెస్ ప్రకంపనలు

ఆగని పెగాసెస్ ప్రకంపనలు

న్యూఢిల్లీ, జూలై 27, 
పుగాసస్‌' నిఘా వ్యవహారం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యులు ఈ అంశంపై చర్చ జరగాలని డిమాండ్‌ చేస్తున్నారు. మోడీ సర్కార్‌ అక్రమ నిఘా కార్యకలాపాలకు పాల్పడుతోందని వారు ఆరోపిస్తున్నారు. మనదేశంలోని ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలపై నిఘా కార్యకలాపాలకు సంబంధించి కొద్ది రోజుల క్రితం పరిశోధనాత్మక వార్తా కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంపై పార్లమెంట్‌ కమిటీ నేతృత్వంలో విచారణ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. నిఘాకు సంబంధించి చట్టాలు, నియమ నిబంధనలపై న్యాయ నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
షరతులు వర్తిస్తాయిప్రభుత్వ నిఘా గురించి 'ఐటీ చట్టం-2000'లో సెక్షన్‌ 69లో కొన్ని విషయాలున్నాయి. ఇది పూర్తిగా ఎలక్ట్రానిక్‌ నిఘా వ్యవహారాలకు సంబంధించినది. అంటే కంప్యూటర్‌ ద్వారా వెళ్లే ఏ సమాచారాన్నైనా హ్యాకింగ్‌ లేదా ట్యాపింగ్‌ చేయటం. భారత దేశ సార్వభౌమత్వం, సమగ్రతలను కాపాడుకోవటం కోసం, దేశ భద్రతా ప్రయోజనాలు కాపాడుకోవటం కోసం, విదేశీ సంబంధాలు, శాంతి భద్రతల కోసం, తీవ్రమైన నేర విచారణ కోసం ప్రభుత్వాలు చట్టపరిధిలో నిఘాను చేపట్టవచ్చునని సెక్షన్‌ 69 చెబుతోంది. అయితే పెగాసస్‌ లాంటి నిఘా వ్యవహారం పూర్తిగా చట్ట విరుద్ధమని న్యాయవాది, ఇంటర్నెట్‌ ఫ్రీడం ఫౌండేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అపర్‌ గుప్తా చెబుతున్నారు. అక్రమ పద్ధతుల్లో, ఆమోదయోగ్యం కాని విధానాలతో పెగాసస్‌ ద్వారా కేంద్రం నిఘా కార్యకలాపాలకు దిగిందని ఆయన అన్నారు. ఐటీ చట్టంలోని సెక్షన్‌-66 ప్రకారం అది నేరమేనని చెప్పారు. పౌరుల వ్యక్తిగత స్మార్ట్‌ఫోన్‌, పర్సనల్‌ కంప్యూటర్‌, ట్యాబ్‌...మొదలైనవాటిలో వైరస్‌ లేదా బగ్‌ లేదా స్పైవేర్‌ను ప్రవేశపెట్టి సమాచారాన్ని సేకరించటం నేరమని సెక్షన్‌-66 చెబుతోందన్నారుచట్టపరిధిలో నిఘాను చేపట్టవచ్చునని 'ద ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్ట్‌, 1885'లోని సెక్షన్‌ 5(2) స్పష్టంచేస్తోంది. అయితే నిఘా కార్యకలాపాల్ని ప్రభుత్వం ఎలా చేపట్టాలన్నది టెలిగ్రాఫ్‌ రూల్స్‌, 1951లోని రూల్‌ 419ఏ చెబుతోంది. పౌర సంఘాలు వర్సెస్‌ కేంద్రానికి సంబంధించి 1996నాటి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా టెలిగ్రాఫ్‌ రూల్స్‌లో నిబంధన 419ఏను చేర్చారు. టెలిఫోన్‌ సంభాషణలు ట్యాపింగ్‌ చేయటమన్నది పౌరుల గోప్యతా హక్కుకు కిందకు వస్తుందని ఆ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఏదైనా ఫోన్‌ను ట్యాపింగ్‌ (నిఘా) చేయాలంటే.. కేంద్రం లేదా రాష్ట్రంలో హోంశాఖ కార్యదర్శి ఆదేశాలుండాలి..అని రూల్‌ 419ఏ చెబుతోంది.పుట్టస్వామి వర్సెస్‌ కేంద్రం 2017నాటి కేసులో సుప్రీంకోర్టు మరింత వివరణ ఇచ్చింది. ప్రభుత్వం చేపట్టే నిఘా చట్టపరంగా చెల్లుబాటు అయ్యేవిధంగా ఉండాలని సుప్రీం చెప్పింది. నిఘా కోసం ఎంచుకునే మార్గాలు, పద్ధతులు సరైనవని తేలాలి. నిబంధనలు పాటిస్తున్నామా? లేదా? అన్నది చెక్‌ చేసుకోవాలని సుప్రీం సూచించింది.

Related Posts