హైదరాబాద్, జూలై 27,
డేటా సెంటర్స్‌కు హబ్‌గా హైదరాబాద్ మారుతోంది. పెద్ద కంపెనీలు సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు, సోషల్ మీడియా, ఓటీటీ, పేమెంట్స్ సర్వీసెస్ డేటా, ఐటీ, ఫార్మా స్యూటికల్.. ఇలా ప్రతీ సెక్టార్ డిజిటల్‌గా మారుతోంది. దీంతో విపరీతమైన డేటా క్రియేట్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా కంపెనీలు తమ కస్టమర్ల డేటాను కేవలం ఇండియాలో ఉన్న డేటా సెంటర్లలోనే స్టోర్ చేయాలనే రూల్స్ తీసుకొచ్చింది. ఈ రూల్స్ ఫాలోకానందుకే కొత్తగా ఎటువంటి కార్డులను ఇష్యూ చేయకుండా మాస్టర్‌కార్డ్‌పై ఆర్‌బీఐ రిస్ట్రిక్షన్లు విధించింది. ప్రభుత్వం డేటా లోకలైజేషన్ రూల్‌ను తీసుకొచ్చినప్పటి నుంచి దేశంలో డేటా సెంటర్లను పెట్టేందుకు ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్లు భారీగా వస్తున్నాయి. లోకల్ కంపెనీలు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు తమ డేటా సెంటర్ కెపాసిటీని పెంచుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై సిటీలు డేటా సెంటర్లకు హబ్‌గా మారుతున్నాయి. హైదరాబాద్‌లో డేటా సెంటర్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. అతిపెద్ద క్లౌడ్ సర్వీసెస్ కంపెనీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ డేటా సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. దీని కోసం సుమారు 1.6 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండు డేటా సెంటర్లను పెట్టాలని చూస్తోంది. సిటీకి దగ్గర్లోని మీర్‌ఖాన్‌పేట్‌లో 82,883 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. మరో సెంటర్‌ను హైథాబాద్ దగ్గర 66,003 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తోంది. ఈ డేటా సెంటర్లు 2023 నాటికి అందుబాటులోకి రానున్నాయి. మరో పెద్ద కంపెనీ మైక్రోసాఫ్ట్ కూడా హైదరాబాద్‌లో తమ డేటా సెంటర్‌ను పెట్టాలని చూస్తోంది. ఒకే ప్లేస్‌లో పెట్టాలా లేదా రెండు మూడు చోట్లలో పెట్టాలో ఇంకా కంపెనీ నిర్ణయించుకోలేదు. హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ను పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం 2 బిలియన్ డాలర్లను మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్ చేయనుందని వార్తలొచ్చాయి.కరోనాకు ముందు కూడా హైదరాబాద్ డేటా సెంటర్ సెగ్మెంట్లోకి పెట్టుబడులు వచ్చాయి. ఫ్లిప్‌కార్ట్ 2019 లో తమ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసింది. కంట్రోల్‌ఎస్, కొత్తగా రెండు డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్లాన్స్ వేసుకుంది. ఇందులో ఒకటి 70–80 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని, ఇంకొకటి 1.3 లక్షల చ.అ. ముంబైలో ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ రెండింటికి కలిపి మొత్తం రూ. 300 కోట్లను ఖర్చు చేయనుంది. డేటా సెంటర్‌ల అవసరాల కోసం సోలార్ ఎనర్జీపై ఆధారపడతామని కంపెనీ ప్రకటించింది. ప్రభుత్వ కంపెనీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ కూడా హైదరాబాద్‌కు దగ్గర్లోని నార్సింగి వద్ద టైర్ –4 టైప్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని, రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది. 5జీ నెట్‌వర్క్‌ను పెంచేందుకు టెలికం కంపెనీలు తమ డేటా సెంటర్లను విస్తరిస్తున్నాయి. ఇది సిటీలోకి పెట్టుబడులు రావాడానికి సాయపడుతుంది. ప్రస్తుతం ఇండియా డేటా సెంటర్ కెపాసిటీ (డేటాను స్టోర్ చేయగలిగే కెపాసిటీ) 447 మెగా వాట్స్‌గా ఉంది. ఇంకో మూడేళ్లలో ఈ కెపాసిటీ మరో 567 మెగావాట్స్ పెరుగుతుందని ఇండస్ట్రీ ఎక్స్‌పర్టులు అంచనావేస్తున్నారు. 2023 నాటికి దేశంలో డేటా సెంటర్ కెపాసిటీ 1,007 మెగా వాట్లకు చేరుకుంటుందని చెబుతున్నారు. 2023 నాటికి దేశ డేటాసెంటర్ కెపాసిటీలో తెలంగాణ వాటా 66 మెగా వాట్లకు చేరుకుంటుందని, ఇది 9.5 శాతం వాటాకు సమానమని అంటున్నారు. ప్రస్తుతం దేశంలోని డేటా సెంటర్ కెపాసిటీలో 7 శాతం వాటా తెలంగాణలోనే లొకేట్ అయి ఉంది. రాష్ట్రంలో 30 మెగా వాట్ల డేటా సెంటర్ కెపాసిటీ ఉంది. టాలెంట్ ఉన్న యువత ఉండడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా మంచి పొజిషన్‌లో ఉండడం, దేశంలోని ముఖ్యమైన సిటీలకు దగ్గర్లో ఉండడం వంటివి డేటా సెంటర్ల ఏర్పాటుకు హైదరాబాద్‌ను కీలకంగా ఉంచుతున్నాయని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్ ఒకరు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 2016 లోనే డేటా సెంటర్ పాలసీని తీసుకొచ్చింది. ఇన్సెంటివ్‌లు, పవర్ సప్లయ్ పరంగా అంతరాయం లేకపోవడం, డేటా సెంటర్లను పెట్టడానికి ఇతర సిటీలతో పోలిస్తే ఖర్చు తక్కువగా అవుతుండడం వంటివి హైదరాబాద్‌ను డేటా సెంటర్ మార్కెట్‌లో టాప్‌లో ఉంచుతాయని జేఎల్‌ఎల్ తెలంగాణ ఎండీ సందీప్ పట్నాయక్ అన్నారు. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, చెన్నై సిటీలలో డేటా సెంటర్ల ఇన్వెస్ట్‌మెంట్లు ఎక్కువగా వస్తున్నాయి. ఈ సిటీల వాటా డేటా సెంటర్ మార్కెట్‌లో 75 శాతంగా ఉంది. వీటితో పాటు హైదరాబాద్, బెంగళూరు వంటి సిటీలు కూడా డేటా సెంటర్ మార్కెట్‌లోకి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షిస్తున్నాయి. దేశంలో డేటా సెంటర్ల సెక్టార్ వేగంగా ఎదుగుతోంది. పెద్ద కంపెనీలు ఈ సెక్టార్‌లోకి వస్తున్నాయి. అమెజాన్ వెబ్‌సర్వీసెస్‌తో కలిసి డేటా సెంటర్లను విస్తరించాలని ఎయిర్‌టెల్ చూస్తోంది. మైక్రోసాఫ్ట్ జియోతో కలిసి డేటా సెంటర్లను విస్తరిస్తోంది. ఇప్పటికే డేటా సెంటర్ మార్కెట్‌లో లీడర్లుగా ఉన్న కంపెనీలు కంట్రోల్‌ఎస్, ఈఎస్‌డీఎస్, టాటా కమ్యూనికేషన్, నెక్స్ట్‌జెన్, నెక్స్‌ట్రా డేటా లిమిటెడ్ (ఎయిర్‌టెల్‌కు చెందిన కంపెనీ), వెబ్ వెర్క్స్ వంటి కంపెనీలు తమ సామర్ధ్యాన్ని మరింత పెంచుకోవాలని చూస్తున్నాయి. దేశంలో జాయింట్ వెంచర్ల ద్వారా డేటా సెంటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను డెవలప్ చేస్తామని బ్రూక్‌ఫీల్డ్ ప్రకటించింది. అదానీ గ్రూప్ కూడా ఈ మార్కెట్‌లోకి ఎంటర్ అవుతోంది.