YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రేవంత్ కు తొలి పరీక్ష

రేవంత్ కు తొలి పరీక్ష

హైదరాబాద్, జూలై 27, 
గత ఏడేళ్లుగా కాంగ్రెస్ కు ఎన్నికలంటేనే భయం పట్టుకుంది. పార్టీ ప్రమేయం లేకుండానే ఎన్నికలు వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా కాంగ్రెస్ ప్రాణం మీదకు వచ్చింది. ప్రతి ఎన్నికలో ఓటమి పలకరిస్తుండటంతో కాంగ్రెస్ నేతలకు ఎన్నిక అంటేనే భయం పట్టుకుంది. కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎవరైనా హుజూరాబాద్ ఉప ఎన్నికతో తొలి దెబ్బ తగులుతుంది. ఎందుకంటే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆశల్లేవు.తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కచోట కూడా విజయం సాధించలేకపోయింది. తన సిట్టింగ్ స్థానాలైన నారాయణఖేడ్, పాలేరు, హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలయింది. దుబ్బాక లో అసలు పోటీలో కూడా లేదు. మొత్తం ఐదు ఉప ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్ ఉప ఎన్నిక మరోసారి షాక్ ఇస్తుందనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.నాగార్జున సాగర్ లో బలమైన అభ్యర్థి జానారెడ్డి ఉన్నా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అలాంటిది హుజూరాబాద్ లో గెలుపు అంటే కాంగ్రెస్ అత్యాశేనని చెప్పాలి. హుజూరాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఆయన ఇటీవల కేటీఆర్ తో ఒక కార్యక్రమంలో భేటీ కావవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మరోవైపు ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరడంతో అక్కడ బీజేపీకి బలం లేకపోయినా ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా మారింది.దీంతో హుజూరాబాద్ లో కాంగ్రెస్ మూడోస్థానానికి పరిమితం కావాల్సిందేనని ముందే తెలిసిపోయింది. హుజూరాబాద్ లో అధికార టీఆర్ఎస్,బీజేపీ మధ్యనే పోరు ఉంది. దీంతో కాంగ్రెస్ నేతలు హుజూరాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ ముందే ఆశలు వదిలేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త పీసీసీ అధ్యక్షుడికి తొలి ఓటమి ఎదురు చూస్తుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ ఉప ఎన్నికతో కాంగ్రెస్ ఆరో ఓటమిని మూటగట్టుకోవాల్సి ఉంటుంది

Related Posts