YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

మారుతున్న చదువులు

మారుతున్న చదువులు

హైద్రాబాద్, జూలై 27, 
కరోనా నేపథ్యంలో ఈ సారి విద్యార్థులు స్థానికంగా ఉన్న కళాశాలల్లోనే చదువుకునే అవకాశాలు ఉన్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడటంతో పాటు హాస్టళ్లు కూడా మూతపడ్డాయి. లాక్‌డౌన్ సమయంలో దూరప్రాంతాలలో ఉన్న విద్యార్థులు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను విదేశాలకు గానీ, దేశంలోని దూర ప్రాంతాలకు పంపించేందుకు తల్లిదండ్రులు అంతగా ఆసక్తి కనబరచడం లేదు. హాస్టళ్లలో పరిస్థితులు ఎలా ఉంటాయో..? అన్న సందేహాలు అందరిలో కలవరపెడుతున్నాయిదాంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ కోర్సుల్లో ఇతర రాష్ట్రాలలో ఇతర రాష్ట్రాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులు తమ ఆలోచనను మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో జెఇఇ, నీట్ పరీక్షలు జరుగనుండగా, ఆగస్టులో రాష్ట్ర ప్రవేశ పరీక్షలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో దాదాపు అన్ని కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అప్పటికి కరోనా పాజిటివ్ కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు తలెత్తితే విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచనల్లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. లేనిపక్షంలో స్థానికంగా ఉన్న కళాశాలల్లో విద్యార్థులు ప్రవేశాలు పొందే అవకాశం కనిపిస్తోంది.కరోనా నేపథ్యంలో జాబ్ మార్కెట్‌లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గతంలో మాదిరిగా భారీ ప్యాకేజీలతో క్యాంపస్ ప్లేస్‌మెంట్లు లభిస్తాయన్న నమ్మకం విద్యార్థుల్లో సన్నగిల్లుత్నున్నట్లు కనిపిస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునేందుకు విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందిన వి ద్యార్థుల ఆఫర్లను కొన్ని కంపెనీలు వాయిదా వేయగా, మరికొన్ని కంపెనీలు ర ద్దు చేసుకున్నాయి. ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించి సీటు పొందినా గతంలో ఆశించిన ఫలితం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా ప్రభావంతో జాబ్ మార్కెట్‌లో చోటు చేసుకున్న మార్పులు కొన్ని సంవత్సరాల పాటు ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దేశంలోనే అధిక సంఖ్యలో విద్యార్థులకు చదువుకునే అవకాశాలు కల్పించేందుకు, కరోనా కారణంగా విదేశాల నుంచి తిరిగివచ్చే విద్యార్థులకు సైతం ఇక్కడ చదువు కొనసాగించే అవకాశం కల్పించే లక్ష్యంతో రూపొందించే కార్యక్రమానికి మార్గదర్శకాలను తయారుచేయడం కోసం మానవ వనరుల శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) ఛైర్మన్ సారథ్యంలోని ఈ కమిటీ, ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో మరింత మందిని చేర్చుకునే అవకాశాలపై సైతం సిఫారసులు చేయనుంది. ఈ కమిటీ 15 రోజుల్లోగా తన రిపోర్టు అందించాల్సి ఉంది. విదేశాల్లో చదువుకోవాలనుకున్న అనేక మంది విద్యార్థులు కోవిడ్ -19 కారణంగా ఇప్పుడు భారత్‌లోనే చదువుకోవాలని భావిస్తున్నారు. అమెరికా నుంచి భారత్‌కి తిరిగి వచ్చే విద్యార్థుల సంఖ్య సైతం పెరుగుతోందని స్టే ఇన్ ఇండియా అండ్ స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమంలో హెచ్‌ఆర్‌డి మంత్రి రమేష్ పోక్రియాల్ నిశాంక్ వెల్లడించారు

Related Posts