మాన్సాస్ ఈవోపై హైకోర్టు అసంతృప్తి
అమరావతి
మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈవో వ్యవహార శైలిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చైర్మన్ అశోక్ గజపతిరాజు ఆదేశాలను ఈఓ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఆడిట్ అధికారితో మాత్రమే ఆడిట్ చేయించాలని ఇతరుల ప్రమేయం ఉండకూడదని స్పష్టం చేసింది.