YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

లిబియాలో పడవ ప్రమాదం 57 మంది మృతి

లిబియాలో పడవ ప్రమాదం 57 మంది మృతి

లిబియాలో పడవ ప్రమాదం 57 మంది మృతి
న్యూ ఢిల్లీ జూలై 27
 లిబియాలో జరిగిన పడవ ప్రమాదం 57 మంది మృతి చెందారు. వలసదారులతో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో 57 మంది మృతి చెందారని భావిస్తున్నట్లు యూఎన్‌ మైగ్రేషన్‌ అధికారి ఒకరు తెలిపారు. పడవ పశ్చిమ తీర పట్టణం ఖుమ్స్ నుంచి ఆదివారం బయలుదేరిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రతినిధి సఫా మెహ్లీ పేర్కొన్నారు. దుర్ఘటన జరిగిన సమయంలో పడవలో 75 మంది వరకు ఉన్నట్లు అల్‌జజీరా పేర్కొంది. 18 మందిని ఈదుకుంటూ వచ్చి సోమవారం ఒడ్డుకు చేరుకున్నట్లు మెహ్లీ తెలిపారు. మృతుల్లో నైజీరియా, ఘనా, గాంబియాకు చెందిన వారున్నారు. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య కారణంగా సముద్రంలోనే పడవ ఆగిపోయిందని, ఆ తర్వాత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బోల్తాపడిందని అల్‌జజీరా చెప్పింది. మృతుల్లో 20 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐరోపాలో మెరుగైన జీవితం కోసం వలసదారులు, శరణార్థులు మధ్యధరా సముద్రం మీదుగా పడవల్లో వలస వెళ్తున్నారు. ఇదిలా ఉండగా.. మరో 500 వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. అధికారులు అడ్డుకొని లిబియాకు తరలించారు. ఇటీవలి నెలల్లో లిబియా నుంచి వలస వెళ్తున్న వారి సంఖ్య పెరిగింది. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో దాదాపు 15 వేల మంది శరణార్థులు, శరణార్థులు వలసదారులను ఈయూ మద్దతు గల లిబియా కోస్ట్‌గార్డ్‌ అడ్డుకున్నారు. ఐక్యరాజ్య సమితి 2020లో దిగిన వారి కంటే ఎక్కువ అని చెప్పారు. ఈ సంవత్సరం మొదటిది ఆరు నెలలు సముద్రం మీదుగా వలస వెళ్తున్న అడ్డుకొని 7వేల మందికిపైగా లిబియాలోని నిర్బంధ శిబిరాలకు బలవంతంగా తరలించారు. 2011 తిరుగుబాటు తర్వాత నుంచి పడవల ద్వారా జనం యూరప్‌కు వలస వెళ్తున్నారు.

Related Posts