YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్న ప్రవాహం ఎడమగట్టు జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో కొనసాగుతున్నది విద్యుత్‌ ఉత్పత్తి

శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్న ప్రవాహం ఎడమగట్టు జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో కొనసాగుతున్నది విద్యుత్‌ ఉత్పత్తి

శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్న ప్రవాహం
ఎడమగట్టు జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో కొనసాగుతున్నది విద్యుత్‌ ఉత్పత్తి
శ్రీశైలం జూలై 27
శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ప్రవాహం వచ్చి చేరుతున్నది. శ్రీశైలం డ్యామ్‌కు ప్రస్తుతం 3,22,262 క్యూసెక్కుల భారీ వరద వస్తున్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం జలాశయంలో 874.40 అడుగుల మేర నీరుంది. డ్యామ్‌ గరిష్ఠ నీటి నిల్వ సామర్థం 215.807 టీఎంసీలు కాగా.. 160.9100 టీఎంసీల నిల్వ ఉన్నది. ప్రస్తుతం వరద ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లోనే డ్యామ్‌ నిండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఎడమగట్టు జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతున్నది. ఇదిలా ఉండగా.. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌కు 18,142 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. డ్యామ్‌ నుంచి 3,988 క్యూసెక్కులు ఔట్‌ ఫ్లో ఉన్నది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 539.10 అడుగులు మేర నిల్వ ఉంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. ఇప్పుడు 186.4567 టీఎంసీల నీరు ఉంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి ప్రవాహం వచ్చి చేరుతున్నది.

Related Posts