YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కృష్ణా జలాల పంపిణీపై కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలి  టిడిపి నాయకుల డిమాండ్

కృష్ణా జలాల పంపిణీపై కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలి  టిడిపి నాయకుల డిమాండ్

కృష్ణా జలాల పంపిణీపై కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలి
 టిడిపి నాయకుల డిమాండ్
నెల్లూరు
నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రైతు నాయకులు, మాజీ అగ్రికల్చర్ మార్కెటింగ్  ఛైర్మెన్స్, నీటి సంఘాల అధ్యక్షుల స మావేశం నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్  అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా పార్టీ పోలిట్  బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర  హాజరు అయినారు.ఈ సమావేశంలో ఈ క్రింద అంశముల గురించి చర్చించి తీర్మానించదమైనది.కృష్ణ జలాల గురించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్ వలన రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు .కావున కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని సమావేశం డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వై. యస్. జగన్మోహన్ రెడ్డి  కేంద్ర ప్రభుత్వం  పై వత్తిడి తెచ్చి నోటిఫికేషన్ రద్దు చేయించి, సవరణలతో కూడిన కొత్త నోటిఫికేషన్ ఇప్పించాలి అని డిమాండ్ చేశారు.నోటిఫికేషన్ రద్దు అయ్యే వరకు అఖిలపక్ష పార్టీలతో కలసి జిల్లా వ్యాప్తముగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని సమావేశంలో తీర్మానం చేశారు.సోమశిల ఉత్తర కాలువకు సంబందించి గత ప్రభుత్వంలో మంజూరు అయిన పనులను రద్దు చేయడము వలన ఈ కాలువ క్రింద 40 వేల ఎకరాలలో సాగు ప్రశ్నార్ధకమైయింది అని అన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేసిన పనులను తిరిగి మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. నెల్లూరు జిల్లాలో రెండో పంట క్రింద 1010  వారిని సాగు చేయడము గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో 1010 రకం ధాన్యానిని ప్రభుత్వము కొనుగోలు చేయగా,ఈ ప్రభుత్వ హాయాములో ఈ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడము లేదన్నారు .అందువలన ఈ రకం ధాన్యాన్ని పండించిన రైతులు తప్పనిసరి పరిస్థితులలో తెగనమ్ముకొంటున్నారు అని పేర్కొన్నారు. కావున ప్రభుత్వం వెంటనే 1010 రకం ధాన్యాన్ని కొనుగోలు చేయుటకు అవసరమైన ఉత్తర్వులు ఇవ్వాలని సమావేశం ప్రభుత్వాన్ని కోరుతూ డిమాండ్ చేశారు.ధాన్యం అమ్మి 3 నెలలు గడిచినా ఇంకా చాలామంది రైతులకు ప్రభుత్వం బకాయిలు చెల్లించ లేదన్నారు. కావున ప్రభుత్వం వెంటనే ధాన్యం బకాయిలను చెల్లించాలని కోరుతూ సమావేశంలో తీర్మానం చేశారు.జిల్లాలో రైతులు పండించిన పసుపు, వేరు శనగ, పొగాకు, నిమ్మ కు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదన్నారు. అందువలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అని తెలియజేశారు. గత తెలుగుదేశం హయాంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడం జరిగిందన్నారు. అయితే ఈ ప్రభుత్వంలో వారిని గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యారు అని అన్నారు. ఇప్పటికైనా పై పంటలను రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .జిల్లాలో ఉన్న నెల్లూరు బ్యారేజి, సంగం బ్యారేజీ, సోమశిల హైలెవల్ కెనాల్ పేస్ 1, పేస్  2 తదితర ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయి అని ధ్వజమెత్తారు. జిల్లాకు చెందిన వ్యక్తి నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పటికిని, ఈ ప్రాజెక్టుల పనులు సరిగా జరగడం లేదని ఆరోపించారు. ఈ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని సమావేశం ప్రభుత్వాన్ని కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత తెలుగుదేశం హయాంలో వ్యవసాయ శాఖ ద్వారా పెద్ద ఎత్తున ఆధునిక వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేయడమే కాకుండా డ్రిప్ ఇరిగేషన్ కు పెద్ద ఎత్తున సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించడం జరిగిందన్నారు .అయితే ప్రస్తుత ప్రభుత్వం వీటన్నింటిని రద్దు ఒసేయ్ చేసిందన్నారు. రైతులకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వవలసిన వ్యవసాయ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తపరిచారు. రైతులకు గత ప్రభుత్వ హయాంలో ఇస్తున్న రాయితీలు అన్నింటిని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశంలో తీర్మానం చేశారు.ఈ సమావేశంలో గూడూరు మాజీ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ , నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి , తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి , మాజీ జడ్పీ చైర్మన్ పొన్నెబోయిన చంచల బాబు యాదవ్ , రైతు నాయకులు రాపూరు సుందర రామిరెడ్డి , కండ్లగుంట మధుబాబు, నెల్లూరు ప్రభాకర్ రెడ్డి, రావూరు రాధా కృష్ణ నాయుడు, పమిడి రవికుమార్ చౌదరి, కొండూరు పోలిశెట్టి, జలదంకి శ్రీహరి నాయుడు, వంటేరు జయచంద్రారెడ్డి, పులిగండ్ల మధుమోహన్, తిరుమూరు సుధాకర్ రెడ్డి, బీద గిరిధర్, బొమ్మి సురేంద్ర, అన్నం దయాకర్ గౌడ్,  రైతు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
 

Related Posts