YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టిడిపి సీనియర్ నేత కందుల కొండయ్య దొర విగ్రహాన్ని ఆవిష్కరించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్

టిడిపి సీనియర్ నేత కందుల కొండయ్య దొర విగ్రహాన్ని ఆవిష్కరించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్

టిడిపి సీనియర్ నేత కందుల కొండయ్య దొర విగ్రహాన్ని ఆవిష్కరించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్
జగ్గంపేట
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మురారి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నేత మాజీ రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రాష్ట్ర సివిల్ సప్లై మాజీ డైరెక్టర్ మాజీ జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దివంగత కందుల కొండయ్య దొర విగ్రహాన్ని ఆయన స్వగ్రామం మురారి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా జ్యోతుల నెహ్రూ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా నిమ్మకాయల చినరాజప్ప గోరంట్ల బుచ్చయ్య చౌదరి జ్యోతుల నవీన్ కుమార్ ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పార్టీలో గ్రామస్థాయి నుంచి ఒక కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు ఎదిగి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అని అన్నారు  నారా లోకేష్ మాట్లాడుతూ కొండయ్య దొర సామాన్య రైతు కుటుంబంలో పుట్టి  కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని నడిపించి మెట్ట ప్రాంతంలో పార్టీ పటిష్టతకు కృషి చేసిన సీనియర్ నాయకులు కందుల కొండయ్య దొర అని ఆయన మనకు దూరం అవడం పార్టీకి తీరనిలోటు అని ఆయన అన్నారు. కొండయ్య దొర విగ్రహం ఆవిష్కరించడం నా అదృష్టం అన్నారు పార్టీలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షులుగాను పాత హౌసింగ్ బోర్డ్ మరియు సివిల్ సప్లై డైరెక్టర్ గాను సేవలందించి పదవులకే  వన్నె తెచ్చిన నాయకులు కొండయ్య దొర అని ఆయన కొనియాడారు. జ్యోతుల నెహ్రూ పార్టీ మారినప్పుడు పార్టీ ని కాపాడిన వ్యక్తి దొర అన్నారు. ఆయన మరణించినపుడు ఎంతో బాధపడ్డాను ఉన్నారు జగన్ రెడ్డి నిత్యావసర వస్తువుల రేట్లు పెట్రోలు డీజిల్ గ్యాస్ ఇలా అన్ని పెంచి సామాన్యులకు పెనుభారం మోపే డుఅన్నారు. ఈ కార్యక్రమంలో   ఎమ్మెల్యే లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి భవాని వాసు, మాజీ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, ఎస్ వి ఎస్ ఎన్ వర్మ ,గొల్లపల్లి సూర్యారావు, అయితా బత్తుల ఆనంద రావు, వంతల రాజేశ్వరి ,సీఎం సీన్ మాధుర్ బాలయోగి కాకినాడ మేయర్ సుంకర పావని టీడీపీ ఇంచార్జ్ వరుపుల రాజా, మెట్ల రమణబాబు ,ఎస్ వి ఎస్ అప్పలరాజు, కోర్పు లచ్చయ్య దొర, మారిశెట్టి భద్రం, పోతుల మోహన రావు కొత్త కొండ బాబు,కొర్పు సాయి తేజ,చదరం చంటిబాబు

Related Posts