YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

గాంధీ హాస్పిటల్ లో 3వ తేదీ నుంచి అన్నిరకాల వైద్య సేవలు

గాంధీ హాస్పిటల్ లో 3వ తేదీ నుంచి అన్నిరకాల వైద్య సేవలు

గాంధీ హాస్పిటల్ లో 3వ తేదీ నుంచి అన్నిరకాల వైద్య సేవలు
హైదరాబాద్‌ జూలై 27
 సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానలో వచ్చే నెల 3వ తేదీ నుంచి అన్నిరకాల వైద్య సేవలను పునరుద్ధరించనున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో దవాఖానలో నాన్‌ కొవిడ్‌ సేవలను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా విజృంభణతో ఏప్రిల్‌ 15న గాంధీ దవాఖానలో కొవిడ్ సేవలు తప్ప నాన్ కొవిడ్ సేవలు (ఔట్‌ పేషెంట్, ఇన్‌ పేషెంట్‌ సేవలు, సర్జరీలు) నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నెలలుగా సాధారణ వైద్య సేవలు అందక రోగులు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం కరోనా ఉధృతి లేకపోవడంతో రోగులకు ఇబ్బంది లేకుండా అన్నిరకాల సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది

Related Posts