YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మొగలి రేకుల సీరియల్ లా... రఘురామ ఎపిసోడ్

మొగలి రేకుల సీరియల్ లా... రఘురామ  ఎపిసోడ్

ఏలూరు, జూలై 28, 
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అత్యంత వినోదభరిత కార్యక్రమం ఏమిటి అని ఎవరిని అడిగినా రఘురామకృష్ణంరాజు సీరియల్ ఎపిసోడ్స్ చెబుతారు. కరోనా లో జగన్ సర్కార్ పై అలుపెరగకుండా విమర్శలు, ఆరోపణలు ఎక్కుపెడుతూ అందరిని నవ్విస్తూ, వైసీపీ ని ఏడిపిస్తూ వస్తున్నారు నర్సాపురం ఎంపి.  ఆయనపై చర్యలు తీసుకోకుండా వినోదం లో పాలుపంచుకుంటూ పార్లమెంట్ స్పీకర్ పరోక్షంగా వైసిపిని ఇబ్బంది పెడుతున్నారు. రఘురామకృష్ణంరాజు ను సిఐడి అరెస్ట్ చేయడం, కోర్టు మీడియా ముందుకు వెళ్లోద్దని ఆదేశించినా కొంతకాలం లేఖలతో టిడిపి మీడియా కు పతాక శీర్షికలుగా మారుతూ వచ్చారు. తాజాగా ఆయనకు బెయిల్ నిబంధనల్లో వచ్చిన సడలింపులతో తిరిగి బుల్లి తెర పైనా సోషల్ మీడియా లో యధావిధిగా హల్చల్ సాగిస్తున్నారు. పాడిందే పాటరా అన్న చందంగా నిత్యం జగన్ సర్కార్ పై ప్రతిపక్షాలకు మించి స్వపక్ష ఎంపి చదువుతున్న అష్టోత్తర నామావళి కూడా ప్రజలకు బోర్ కొట్టించింది. ఈ మధ్య ఆయన రేటింగ్ కూడా దారుణంగా పడిపోయిందని మీడియా వర్గాల గణాంకాలే వెల్లడిస్తున్నాయి. రఘురామ కృష్ణ రాజు ఆరోపణలు, విమర్శల్లో పస లేకపోవడంతో బాటు రొటీన్ గా మారిన శైలి కూడా జనాలను ముఖ్యంగా టిడిపి అభిమానులను సైతం ఆకట్టుకోలేకపోతుంది. చంద్రబాబు, లోకేష్ తో రఘురామ కృష్ణ రాజు బంధం సిఐడి బయటకు చాటింగ్ రూపంలో చేసిన లీక్ వ్యవహారంతో ప్రస్తుతం ఆయన్ను టిడిపి నేతగానే జనం చూడ్డం మొదలు పెట్టేశారు. దాంతో రఘురామకృష్ణంరాజు మరింతగా రెచ్చిపోవడం కనిపిస్తుంది. రఘురామ కృష్ణ రాజు ఎపిసోడ్స్ ఇప్పటివరకు ఉండొచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగానే సాగుతుంది. ఇది ఇప్పట్లో ఫినిష్ అయ్యే వ్యవహారం కాదని వచ్చే ఎన్నికల వరకు కొనసాగుతుందని పలువురు భావిస్తున్నారు. స్పీకర్ ఆయనపై అనర్హత వేటు వేసే అంశం అనుమానమేనని అలాగే వైసీపీ ఆయన్ను ఈ పార్లమెంట్ సెషన్ వరకు చూసి బహిష్కరించ వచ్చని తెలుస్తుంది. మరోపక్క ప్రస్తుతం జగన్ బెయిల్ రద్దు కోసం రఘురామకృష్ణంరాజు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అది ఏదో ఒక కారణంతో కోర్ట్ లో జరుగుతున్న కేసు వాయిదాలు పడుతూ ఉండటంతో ఇరుపక్షాల కు ప్రస్తుతం అయితే కంటిమీద కునుకు లేదు. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణ రాజు సీరియల్స్ మొగలి రేకుల సీరియల్ కు మించే నడుస్తుంది ఎవరు చూసినా చూడకపోయినా అన్నది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారికి క్లారిటీ వచ్చేసింది.

Related Posts