YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువు వ్యవసాయం: కేటీఆర్

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువు వ్యవసాయం: కేటీఆర్

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువు వ్యవసాయమని మంత్రి కేటీఆర్ అన్నారు.వ్యవసాయంలో ఉన్న ఆనందం మరే వృత్తిలో ఉండదని మంత్రి మంత్రి పేర్కొన్నారు. రైతులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ పునరుద్ఘాటించారు. సిరిసిల్లలో రైతు బంధు పథకంపై అవగాహన సదస్సుకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..5వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని నియమించినట్లు తెలిపారు.రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసరముందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. నాలుగేళ్లలో 24లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మించినట్లు పేర్కొన్నారు. రైతులు బాగుపడుతుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నరు. ప్రాజెక్టులు కడుతుంటే..రైతులకు సాయం చేస్తుంటే కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నరని కేటీఆర్ మండిపడ్డారు.

Related Posts