YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

31 వేల కోట్లు దాటేసిన విద్యుత్ నష్టాలు

31 వేల కోట్లు దాటేసిన విద్యుత్ నష్టాలు

హైదరాబాద్, జూలై 28, 
రాష్ట్రంలో విద్యుత్‌ పంపిణీ నష్టాలు పెరిగాయి. రూ.31వేల కోట్లతో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినా, నష్టనివారణలో డిస్కంలు చేతులెత్తేశాయి. ఈ విషయాలు కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ ఇచ్చిన 'కేర్‌' రేటింగ్స్‌లో వెల్లడయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్‌ పంపిణీ సంస్థలకు చెందిన 9వ వార్షిక నివేదికను ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 22 రాష్ట్రాల్లో 41 ప్రభుత్వ విద్యుత్‌ పంపిణీ సంస్థల పనితీరును అధ్యయనం చేసి, వాటికి క్రెడిట్‌ అనాలిసిస్‌ అండ్‌ రీసెర్చ్‌ (కేర్‌) ర్యాం కింగ్స్‌ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన దక్షిణ ప్రాంత విద్యుత్‌ పం పిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) 'బీ' గ్రేడ్‌లో 23వ ర్యాంకును సాధించింది. ఈ సంస్థ తన పరిధిలోని 15 జిల్లాల్లో 9.2 మిలియన్ల వినియోగదారులకు సేవలు అందిస్తున్నది. అలాగే ఉత్తర ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్‌) సంస్థ 'సీ ప్లస్‌' గ్రేడ్‌లో 33వ ర్యాంకులో ఉంది. విద్యుత్‌ పంపిణీలో ఈ రెండు సంస్థలు అధ్యాన్నమైన పనితీరును కనబరుస్తున్నట్టు నివేదిక స్పష్టం చేస్తున్నది. గత ఏడాదితో పోల్చితే ఇప్పుడు పదిశాతం ఎక్కువగా నష్టాలను మూటగట్టుకున్నాయివిద్యుత్‌ పంపిణీ సంస్థల సమగ్ర సాంకేతిక, వాణిజ్య నష్టాలు (ఏటీ అండ్‌ సీ) టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 15.4 శాతం ఉండగా, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో 34.49 శాతం ఉన్నాయి. విద్యుత్‌ సరఫరా మెరుగుదలకు దాదాపు రూ.31వేల కోట్లతో నెట్‌వర్క్‌ను నెలకొల్పామని చెప్తున్న డిస్కంల పనితీరు ఆ ఖర్చుకు సరిపడా లేదని విద్యుత్‌రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవాలను అంచనా వేస్తే ఈ నష్టాలు మరింత ఎక్కువే ఉంటాయనీ, అధికశాతం నష్టాలను వ్యవసాయ ఉచిత విద్యుత్‌లో కలిపేస్తున్నారనీ చెప్తున్నారు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలు పోనూ మిగిలిన విద్యుత్‌ సరఫరా మొత్తాన్ని వ్యవసాయ వినియోగం గానే చూపుతున్నారని విద్యుత్‌రంగ నిపుణులు గతంలోనూ ఆక్షేపించారు. పైపెచ్చు 2019తో పోల్చితే పదిశాతం ఏటీ అండ్‌ సీ నష్టాలు పెరిగాయి. ఇక ఏటా ఇవ్వాల్సిన డిస్కంల సమగ్ర వార్షిక ఆదాయ అవసరాల ప్రతిపాదనలు (ఏఆర్‌ఆర్‌) రెండేండ్లుగా తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ఈ ఆర్సీ)కి ఇవ్వనే లేదనీ, దీనివల్ల ఖర్చుకూ, ఆదాయానికి మధ్య వ్యత్యాసం భారీగా పెరిగినట్టు కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది. అలాగే టీఎస్‌ఈ ఆర్సీ నిర్దేశించిన బెంచ్‌మార్క్‌కు కంటే అధికంగా యూనిట్‌ కరెంటును రూ.5.26 పైసలకు కొనుగోలు చేస్తున్నారనీ తెలిపింది. రాష్ట్రానికి అవసరమైన 90 శాతం విద్యుత్‌ను దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారానే కొనుగోలు చేస్తున్నారనీ, ఇంథన వ్యయాన్ని తగ్గించేందుకు డిస్కంల వద్ద ఎలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదని పేర్కొన్నారు. వ్యవసాయంతో పాటు వివిధకేటగిరిల విని యోగదారులకు రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీల సొమ్మును సకాలంలో పం పిణీ సంస్థలకు ఇవ్వట్లేదనీ, దీనివల్ల అవి తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులు ఎదు ర్కొంటున్నాయనీ తెలిపింది. విద్యుత్‌ కొనుగోళ్లు జరిపాక నిర్దేశించిన గడువులోపు ఆయా కంపెనీలకు చెల్లింపులు జరపట్లేదని కూడా నివేదికలో పేర్కొన్నారు. కొనుగోళ్ల తర్వాత గరిష్టంగా 393 రోజలకు చెల్లింపులు చేస్తున్నారని గుర్తించారు. రెండు డిస్కంలు తప్పనిసరిగా పనితీరును మెరుగుపర్చుకోవాలని ఆ నివేదిక హెచ్చరించింది.

Related Posts