YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇది రాజారెడ్డి రాజ్యాంగం నారా లోకేష్

ఇది రాజారెడ్డి రాజ్యాంగం నారా లోకేష్

ఏలూరు
వైసీపీ అరాచకపాలన, మైనింగ్ మాఫియా, అవినీతి-అక్రమాలు, ఆగడాలకు అడుగడుగునా అడ్డుపడున్నారనే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై రాజారెడ్డి రాజ్యాంగం ప్రయోగించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. . దేవినేనిపై దాడిచేసిన నిందితులను ఐపీసీ సెక్షన్లు కింద కేసులుపెట్టి, అరెస్ట్ చేయాల్సిన పోలీసులు...  ఉల్టా ఆయనపైనే వైసీపీ సెక్షన్ల కింద కేసులుపెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధితుల్ని నిందితుల్ని చేసిన దుర్మార్గమైన పోలీసు వ్యవస్థ ఏపీలో వుండటం దురదృష్టకరం. ఒక మాజీ మంత్రినే చట్టవ్యతిరేకంగా ఇంతగా హింసిస్తుంటే..సామాన్యుల పరిస్థితి ఇంకెంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చట్టాన్ని చుట్టం చేసుకున్న పోలీసులూ! తాడేపల్లి కొంప కనుసైగలే చట్టంగా నిర్ణయాలు తీసుకున్న మీ బాస్కి పట్టిన గతే...మీకూ తప్పదు.. కొద్దిగా టైము పడుతుందంతే. చట్టాన్ని మీరు చేతుల్లోకి తీసుకుని అన్యాయంగా వ్యవహరిస్తున్నా...న్యాయం ముందు దోషులుగా నిలబడక తప్పదని అయన అన్నారు.

Related Posts