న్యూఢిల్లీ జూలై 28
రాష్ట్ర ప్రభుత్వం భూమిని సేకరిస్తే, అప్పుడు బొగ్గు ఉత్పత్తి యూనిట్లను ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. కోల్ మైనింగ్ కోసం భూ సేకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలన్నారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వస్తుందన్నారు. స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. జార్ఖండ్‌లో వివిధ ప్రాంతాల్లో బొగ్గు అందుబాటులో ఉందని, కానీ దాన్ని తొవ్వడం లేదని ఎంపీ నిశీకాంత్ దూబే ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోందని ఆయన ప్రశ్నించారు. దానికి మంత్రి జోషి సమాధానం ఇస్తూ.. క బెంగాల్‌లో బొగ్గు ఎత్తుకెళ్తున్న ఘటనలపై ఆయన స్పందిస్తూ.. శాంతిభద్రతలు రాష్ట్రానికి చెందిన అంశమని, మేం వెంటనే పోలీసులకు ఫిర్యాదు నమోదు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు.