YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం లో రూ.7 కోట్ల  గంజాయి పట్టివేత

కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం లో రూ.7 కోట్ల  గంజాయి పట్టివేత

కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం లో రూ.7 కోట్ల  గంజాయి పట్టివేత
భద్రాద్రి కొత్తగూడెం జూలై 28
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి మండల పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. భారీ మొత్తంలో గంజాయి తరలిస్తున్నట్లు చుంచుపల్లి పోలీసులకి సమాచారం అందింది. ఈ మేరకు చుంచుపల్లి ఎస్‌ఐ మహేష్ తన సిబ్బందితో మండలంలోని బృందావనం బ్రడ్జి వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా చేపలతో రవాణా జరుగుతున్న (టీఎస్10యూఏ 4801), (హెచ్ఆర్30జెడ్ 1159) నెంబరు గల ఏయిచర్ వాహనాలను అడ్డుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రెండు వాహనాల నుంచి రూ.7,30,62,000 విలువ చేసే 3,653.100కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు బుధవారం చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సునీల్ దత్ తెలిపారు . గంజాయి తరలిస్తున్న ఏయిచర్ వ్యాన్ డ్రైవర్లు కేస్లే వెంకటేశ్, సేస్లే సుభాష్, కిడ్లే నఫీజ్, ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. ఈ గంజాయి చింతూరులో గుర్తు తెలియని వ్యక్తి నుంచి తీసుకుని ఒక వాహనాన్ని హైదరాబాద్ కి, మరో వాహనాన్ని హర్యానాకు తరిస్తుండగా చుంచుపల్లి పోలీసులు చేధించి పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. భారీ మొత్తంలో గంజాయిని సీజ్ చేసిన ఎస్‌ఐ మహేష్, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ గుడ్లు వెంకటేశ్వర బాబు, చుంచుపల్లి సీఐ గురుస్వామి, పోలీస్ పీఆర్వో దాములూరి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts