సరైన సమయంలో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా: మంత్రి నిత్యానంద్
న్యూఢిల్లీ జూలై 28
ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్ముకశ్మీర్‌కు సరైన సమయంలో రాష్ట్రహోదా కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఎప్పుడు కల్పిస్తారంటూ రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ విధంగా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జమ్ముకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించబడిన తర్వాత సరైన సమయం చూసి రాష్ట్ర హోదా కల్పిస్తామని నిత్యానంద్ రాయ్ తన సమాధానంలో పేర్కొన్నారు.