కేంద్ర ప్రభుత్వం తీరును తప్పుపట్టిన రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ జూలై 28
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ తప్పుపట్టారు. ప్రతిపక్షాలు లేవనెత్తే ఏ ఒక్క అంశంపై కూడా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆయన మండిపడ్డారు. . దేశ ప్రజల సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై పార్లమెంట్‌లో చర్చ జరుగాలని తాము కోరుకుంటున్నామని, కానీ ప్రభుత్వానికి మాత్రం ఆయా అంశాలపై చర్చ ఇష్టంలేదని ఆయన విమర్శించారు. బుదవారం పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశం అనంతరం రాహుల్‌గాంధీ మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పార్లమెంట్లో ప్రతిపక్షాలు లేవనెత్తే కీలక అంశాలపై ప్రభుత్వం చర్చ చేపట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఇంధన ధరల పెరుగుదల, పెగాసస్, వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యేదేలేదని రాహుల్‌గాంధీ తేల్చిచెప్పారుప్రభుత్వం తాము లేవనెత్తిన అంశాలపై చర్చించేవరకు పట్టువిడిచేది లేదని స్పష్టంచేశారు.