YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

పెగాస‌స్ వ్య‌వ‌హారం రాజ‌ద్రోహం జాతి వ్య‌తిరేక చ‌ర్య     పార్ల‌మెంట్‌లో చ‌ర్చించాల‌ని ప్ర‌తిప‌క్షాల డిమాండ్

పెగాస‌స్ వ్య‌వ‌హారం రాజ‌ద్రోహం జాతి వ్య‌తిరేక చ‌ర్య     పార్ల‌మెంట్‌లో చ‌ర్చించాల‌ని ప్ర‌తిప‌క్షాల డిమాండ్

పెగాస‌స్ వ్య‌వ‌హారం రాజ‌ద్రోహం జాతి వ్య‌తిరేక చ‌ర్య
    పార్ల‌మెంట్‌లో చ‌ర్చించాల‌ని ప్ర‌తిప‌క్షాల డిమాండ్
న్యూఢిల్లీ జూలై 28
పెగాస‌స్ స్పైవేర్‌తో హ్యాకింగ్ జ‌రిగిన అంశంపై పార్ల‌మెంట్‌లో చ‌ర్చించాల‌ని బుదవారం  ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దీని గురించి మాట్లాడుతూ.. దేశ ప్ర‌జ‌ల‌పై ఎందుకు ఈ స్పైవేర్‌ను వాడిన‌ట్లు ప్ర‌ధాని మోదీ, అమిత్ షాల‌ను ఆయ‌న అడిగారు. పెగాస‌స్ వ్య‌వ‌హారం జాతీయవాదానికి చెందిన‌ద‌ని, రాజ‌ద్రోహం కూడా ఉన్న‌ట్లు రాహుల్ ఆరోపించారు. ఇది ప్రైవ‌సీకి సంబంధించిన అంశం కాదు అని, ఇది జాతి వ్య‌తిరేక చ‌ర్య అని రాహుల్ అన్నారు. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌లు కూడా మీడియాతో మాట్లాడారు. పెగాస‌స్ వ్య‌వహారం కేవ‌లం ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీకి సంబంధించిన కాదు అని, అది జాతీయ భ‌ద్ర‌త‌కు చెందుతుంద‌ని ఆర్జేడీ నేత మ‌నోజ్ జా, శివ‌సేన నేత సంజ‌య్ రౌత్‌లు తెలిపారు. అందుకే కేంద్ర హోంశాఖ మంత్రి ఆ అంశంపై చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో స‌భ‌లో ఉండాల‌న్నారు. కేంద్ర ఐటీశాఖ మంత్రిని కూడా స్నూపింగ్ చేశార‌ని రౌత్ ఆరోపించారు. డీఎంకే ఎంపీ టీఆర్ బాలూ మాట్లాడుతూ.. ప్ర‌తిప‌క్షాలు చ‌ర్చ‌ల‌ను అడ్డుకుంటున్న‌ట్లు త‌ప్పుడు సందేశాల‌ను ప్ర‌భుత్వం పంపుతోంద‌ని, కానీ దాంట్లో నిజం లేద‌ని, తాము ఎప్ప‌టిక‌ప్పుడు నోటీసులు ఇస్తున్నామ‌ని, కానీ ప్ర‌భుత్వానికి ఈ అంశంపై చ‌ర్చ చేప‌ట్టేందుకు సుముఖంగా లేద‌న్నారు. ప్ర‌జాస్వామ్యం ప్ర‌మాదంలో ప‌డిన‌ట్లు బాలు ఆరోపించారు. కేవ‌లం రాజ‌కీయ‌వేత్త‌లు, న్యాయ‌వ్య‌వ‌స్థ‌పైన మాత్ర‌మే కాదు, ప్ర‌తి ఒక్క‌రిపై పెగాస‌స్ ప్ర‌భావం చూపుతోంద‌ని బాలూ తెలిపారు. ఎస్పీ ఎంపీ రామ్‌గోపాల్ యాద‌వ్ మాట్లాడుతూ.. పెగాసస్ అంశంపై చ‌ర్చించాల‌ని డిమాండ్ చేస్తున్నామ‌ని, కానీ ప్ర‌భుత్వం త‌ప్పుడు ఎజెండాను ప్ర‌చారం చేస్తోంద‌న్నారు. ఎన్సీపీ నేత సుప్రియా సూలే మాట్లాడుతూ.. ఇది జాతీయ భ‌ద్ర‌త‌కు చెందిన అంశ‌మ‌న్నారు. మంత్రుల భార్య‌లు, పిల్ల‌ల్ని కూడా హ్యాక్ చేసిన‌ట్లు ఆమె ఆరోపించారు. స‌భా కార్య‌క్ర‌మాలు స‌జావుగా సాగాలంటే, దానికి ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌న్నారు. హిట్ల‌ర్ పాలించిన జ‌ర్మ‌నీ త‌ర‌హాలో మ‌న దేశం మారుతోంద‌ని సీపీఐ నేత బిన‌య్ విశ్వ‌మ్ తెలిపారు.మ‌రోవైపు ఇవాళ కూడా పార్ల‌మెంట్‌లో పెగాస‌స్ వ్య‌వ‌హారం కుదిపేసింది. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లు ప‌లుమార్లు వాయిదా ప‌డ్డాయి. విప‌క్ష స‌భ్యులు నినాదాల‌తో హోరెత్తించారు.

Related Posts