YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

క్రిప్టో కరెన్సీ వినియోగం గురించి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు

క్రిప్టో కరెన్సీ వినియోగం గురించి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు

క్రిప్టో కరెన్సీ వినియోగం గురించి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
ఎవరైనా క్రిప్టోకరెన్సీ ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తే  మనీ ల్యాండరింగ్‌ విభాగం చర్యలు
         కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌
న్యూ డిల్లీ జూలై 28
పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా దేశంలో క్రిప్టో మార్కెట్‌,వినియోగదారులు ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు కేంద్రం డేటా కలెక్ట్‌ చేస్తుందా? రాజ్యసభ సభ్యుడు సుశీల్‌కుమార్‌ మోడీ అన్న ప్రశ్నలకు నిర్మలా సీతారామన్‌ స్పందించారు.మనదేశంలో క్రిప్టో కరెన్సీ వినియోగం గురించి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు, ఎవరి డేటా కలెక్ట్‌ చేయడం లేదు.ఎవరైనా క్రిప్టోకరెన్సీ ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తే నార్కో్టిక్‌ డ్రగ్‌ ట్రాఫికింగ్‌,మనీ ల్యాండరింగ్‌ విభాగం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.ఇక ఇన్వెస్టర్లు ఎవరైనా విదేశాల నుంచి క్రిప్టోరను భారత్‌కు తీసుకువస్తే వారి నుంచి ఈక్వలైజేషన్ లెవీని కట్టించుకోమని స్పష్టం చేశారు.ఈక్వలైజేషన్‌ లెవీ (ట్యాక్స్‌) కేవలం ఈకామర్స్‌ సంస్థలకు వర్తిస్తుందని, ఇన్వెస్టర్లు వర్తించదని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. మనదేశంలో డిజిటల్‌ కరెన్సీని దశలవారీగా అమలు చేసే అంశంపై ఆర్బీఐ కసరత్తులు చేస్తోంది.ఇప్పటికే హోల్‌సేల్,రిటైల్‌ విభాగంలోనే త్వరలోనే దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించే అవకాశం ఉందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ టి.రవిశంకర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో దేశంలో క్రిప్టో కరెన్సీపై తలెత్తున్న అనుమానాలకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి  నిర్మలా సీతారామన్‌ చెక్‌ పెట్టారు.

Related Posts