YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టిఆర్ఎస్ పార్టీని మించిన పార్టీ రాష్ట్రంలో రాదు -  ఎమ్మెల్యే దానం నాగేందర్

టిఆర్ఎస్ పార్టీని మించిన పార్టీ రాష్ట్రంలో రాదు -  ఎమ్మెల్యే దానం నాగేందర్

టిఆర్ఎస్ పార్టీని మించిన పార్టీ రాష్ట్రంలో రాదు
-  ఎమ్మెల్యే దానం నాగేందర్
హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర సమితిని మించిన పార్టీ రాష్ట్రంలో మరొకటి రాబోదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.  బుధవారం బంజారా హిల్స్ లోని లేక్ వ్యూ బంజారా ఫంక్షన్ హాల్ లో బోనాల పండుగను పురస్కరించుకొని దేవాలయాల కమిటీలకు చెక్కుల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన దానం కార్పోరేటర్ లతో కలిసి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పండుగ ప్రతి ఆలయంలో అద్భుతంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్కుల పంపిణీకి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ తరహా పంపిణీ దేశంలో మరెక్కడా లేదని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే ఉన్నత లక్ష్యంతో ప్రవేశపెడుతున్న పథకాలను విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం ఈ తరహా లో విజయవంతం అయిందో అదే తరహాలో దళిత బంధు పథకం కూడా విజయవంతం అవుతుందని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఎంత ప్రయత్నం చేసినా తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని మించిన పార్టీ మరొకటి వచ్చే అవకాశం లేదని అన్నారు.

Related Posts