YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కొత్తరేషన్ కార్డుల ద్వారా జిల్లా వ్యాప్తంగా 7621 మందికి లబ్ది

కొత్తరేషన్ కార్డుల ద్వారా జిల్లా వ్యాప్తంగా 7621 మందికి లబ్ది

కొత్తరేషన్ కార్డుల ద్వారా జిల్లా వ్యాప్తంగా 7621 మందికి లబ్ది
జిల్లా కలెక్టర్ జి. రవి
 జగిత్యాల, జూలై 28
కొత్త రేషన్ కార్డుల పంపిణీ ద్వారా జిల్లా వ్యాప్తంగా 7621 కుటుంబాలకు లబ్ది చేకూరనున్నదని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు.  బుధవారం జిల్లా కేంద్రంలోని  ఎస్వీఎల్ఆర్ గార్డెన్ లో  జగిత్యాల శాసన సభ్యులు డా. యం. సంజయ్ కుమార్ లతో కలిసి  లబ్దిదారులకు జిల్లా కలెక్టర్ కొత్తరేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,  అర్హులైన ప్రతి ఒక్కరికి  లబ్ది చేకురేల కొత్తరేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్  ఆకాంక్ష మేరకు కొత్త రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు.   రేషన్ కార్డుల కొరకు వచ్చిన ప్రతి ధరఖాస్తును తహసీల్దార్ల ద్వారా దృవీకరించుకోని రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగిందని,  జిల్లాలో 7621 కొత్తరేషన్ కార్డులు మంజూరు కాగా, ఒక్క జగిత్యాల జిల్లా కేంద్రంలో 665 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులను పంపిణి చేయడం జరుగిందని తెలియజేశారు.ఈ కొత్తరేషన్ కార్డుల ద్వారా అగస్టు మాసం నుండి లబ్దిదారులకు చౌకధరల దుఖాణాల ద్వారా సరుకులను అందించడం జరుగుతుందని పేర్కోన్నారు.   రేషన్ కార్డులు కేవలం సరుకుల కొరకు మాత్రమే కాకుండా, చిరునామా మరియు ఇతర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు గుర్తింపుగా కూడా ఉపయోగపడుతుందని పేర్కోన్నారు.ఆనంతరం  
జగిత్యాల శాసన సభ్యులు డా. యం. సంజయ్ కుమార్ మాట్లాడుతూ,  నియోజక వర్గంలో 85,719 మందిరేషన్ కార్డు దారులు ఉండగా, అర్హులైన మరో 1914 కార్డులను జారిచేయడం జరుగుతుందని, పట్టణ కేంద్రంలో 683 మంది ధరఖాస్తు చేసుకోగా 655 మందికి కోత్తగా రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగిందని పేర్కోన్నారు.  సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల అమలుతో  తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని పేర్కోన్నారు.  జగిత్యాల  పట్టణంలో  రోడ్డు విస్తరణ, నూతన వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను అభివృద్ది పరుచుకోవడం,  పాత బస్టాండ్ ప్రాంతంలో ఇరుకుగా ఉన్న రోడ్డును విస్థరణ పనులు,  మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మంచినీటిని ప్రతి ఇంటికి అందించడం, చింతకుంట, మోతే శ్మశానవాటికలను అభివృద్ది చేయడం వంటి అనేక అభివృద్ది కార్యక్రమాలను శ్రీకారం చట్టడం జరుగిందని,  ప్రతి ఇంటి నుండి వెలువడే మరుగు వ్యర్థాలను కాలువలలో కలువకుండా, 2కోట్ల నిధులతో నర్సింగా పూర్గట్ట ప్రాంతంలో  ప్లాంట్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఎరువులను తయారు చేయడం జరిగిందని పేర్కోన్నారు.  పట్టణానికి వచ్చే మహిళలు, పురుషులకు బాత్రూం విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా, రద్దిప్రాతలను గుర్తించి అక్కడ కొత్తగా మరుగుదొడ్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.  కోటి రూపాయలతొ  నర్సరీ, మియావాకీలను అభివృద్ది చేయడం జరిగిందని,  పేద, బడుగు వర్గాలను అభివృద్ది చేయడంలో కృషి చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని  ప్రభుత్వ ఆసుపత్రులలో 37 మంది డాక్టర్ల ద్వారా అన్ని విభాగాలలో నిత్యం ప్రజలకు వైద్య సేవలను అందించడం జరుగుతుందని, మరింత మెరుగైన వైద్య కొరకు ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రతిమ ఆసుపత్రికి తరలించేలా అంబులెన్సును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ డా. చంద్రశేఖర్ గౌడ్, జగిత్యాల ఆర్.డి.ఓ. మాధురి, తహసీల్దార్, కౌన్సిలర్లు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts