కరోనా నివారణపై సీఎం సమీక్ష
అమరావతి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా వైరస్ నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. థర్డ్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. కాన్సన్ట్రేటర్లు, డీటైప్సిలెండర్లు, ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై శ్రద్ధవహించాలని,దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని,పీహెచ్సీల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఉంచాలని సూచించారు.జిల్లాల వారీగా వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి ఏపీఎంఎస్ఐడీసీలో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసే విదంగా చర్యలు తీసుకోవాలని కోరారు.