YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

విజయ్ మాల్యా ఆస్తుల వేలం...

విజయ్ మాల్యా ఆస్తుల వేలం...

విజయ్ మాల్యా ఆస్తుల వేలం...
బ్రిటన్, జూలై 28,చ 
భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి లండన్‌కు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు గట్టి షాక్ తగిలింది. మాల్యాను భారత్‌ అప్పగింత కేసును  విచారించినలండన్ కోర్టు ఆయన దివాళా తీసినట్లు సంచలన ప్రకటన చేసింది. తాజా ఉత్తర్వులతో మాల్యా స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకుని వాటి వేలం ద్వారా బ్యాంకులు తమ రుణాలను జమ చేసుకోవచ్చు.ఇండియాలో మాల్యా ఆస్తులపై సెక్యూరిటీని వదులుకునేందుకు అనుకూలంగా వారి దివాలా పిటిషన్‌ను సవరించాలని ఎస్‌బీఐ నేతృత్వంలోని రుణదాత కన్సార్టియం ఇచ్చిన దరఖాస్తును యుకే కోర్టు సమర్థించింది. ఈ మేరకు లండన్ హైకోర్టు చీఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ కంపెనీస్ కోర్ట్ (ఐసిసి) న్యాయమూర్తి మైఖేల్ బ్రిగ్స్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పునిచ్చారు. తాజా ఆదేశాలతో కొన్నాళ్లుగా మ్యాలాపై సుదీర్ఘం పోరాటం చేస్తున్న భారత బ్యాంకులకు భారీ విజయం దక్కినట్లయింది. లభించినట్టైంది.తాజా తీర్పుపై మాల్యా అప్పీల్‌కు వెళ్లే అవకాశాలను లండన్ హైకోర్టు తోసిపుచ్చింది. దివాలా ఉత్తర్వుకు వ్యతిరేకంగా అప్పీల్ చేయడానికి అనుమతి కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి నిరాకరించారు.

Related Posts