YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మాజీగా బోత్సా... ?

మాజీగా బోత్సా... ?

విజయనగరం, జూలై 29, 
ఉత్తరాంధ్రా జిల్లాలల్లో పక్కా లోకల్ లీడర్ బొత్స సత్యనారాయణ. ఉత్తరాంధ్ర భాషకు, యాసకు ఆయన ప్రతిరూపం. ఆయనది మూడున్నర దశాబ్దాల రాజకీయం. ఈ మధ్యలో ఆయన మంత్రిగా, ఎంపీగా, పీసీసీ చీఫ్ గా పలు కీలకమైన బాధ్యతలను నిర్వహించారు. విజయనగరంలో డీసీసీబీ చైర్మన్ గా రాజకీయ అరంగ్రేట్రం చేసిన బొత్స సత్యనారాయణ దివంగత నేత సాంబశివరాజు ప్రియ శిష్యుడు. ఆయన సాహచర్యంలో ఇంత ఎత్తుకు ఎదిగారు. దానికి ఆయన ప్రాంతం, కులంతో పాటు బొత్స మార్కు రాజకీయ చాకచక్యం కూడా కలసివచ్చింది.బొత్స సత్యనారాయణ రాజకీయ చాణక్యం బహు గొప్పది. అవకాశాల కోసం ఆభిజాత్యాన్ని పక్కన పెట్టే నేర్పు ఆయనకు ఉంది. అందుకే నాడు వైఎస్సార్ క్యాబినేట్ లో కీలక శాఖకు నిర్వహించిన బొత్స సత్యనారాయణ నేడు జగన్ జమానాలోనూ మునిసిపల్ శాఖ వంటి అతి ముఖ్యమైన పోర్ట్ ఫోలియో చూసే అవకాశం దక్కించుకున్నారు. జగన్ సైతం ఎంతమంది సీనియర్లను కాదన్నా కూడా బొత్సను మాత్రం పక్కనే పెట్టుకున్నారు. ఇక జగన్ క్యాబినేట్ లో సీనియర్ మంత్రుల పేర్లు చెప్పమంటే ముందు వరసలో బొత్స ఉంటారు. అలాంటి బొత్స ఇపుడు మంత్రి పదవిని వదులుకుంటున్నారా అన్నదే పెద్ద చర్చగా ఉంది.గత కొంతకాలంగా బొత్స సత్యనారాయణ సైలెంట్ గా ఉంటున్నారు. ఆయన మీడియా ముందుకు కూడా అపుడపుడు మాత్రమే వస్తున్నారు. ఆయన ప్రాధ్యాన్యతల మీద అందరికీ సందేహాలు కూడా వస్తున్న నేపధ్యంలో బొత్సకు విస్తరణలో ఊస్టింగ్ తప్పదన్న ప్రచారం మొదలైంది. బొత్స సత్యనారాయణను తప్పిస్తేనే తప్ప విజయనగరం రాజకీయం తమ స్వాధీనం కాదు అన్నది వైసీపీ పెద్దలకు బాగా తెలుసు. దాంతో చక్రం తిప్పే ఈ చక్రధారిని పక్కన పెట్టేందుకే నిర్ణయించుకున్నారు అంటున్నారు. ఎపుడు మంత్రి వర్గ విస్తరణ జరిగినా బొత్సను ఈసారి తీసుకోరని, బదులుగా అదే జిల్లాకు చెందిన కొత్తవారికి అవకాశం ఇస్తారు అంటున్నారు.ఇక మాజీ మంత్రిగా విజయనగరంలో బొత్స సత్యనారాయణను ఉంచడం కూడా మంచిది కాదు అనుకుంటున్నారో ఏమో కానీ ఆయనకు కొంత వెసులుబాటును కల్పిస్తూ పెద్దల సభకు పంపాలని కూడా పై స్థాయిలో నిర్ణయం జరిగింది అంటున్నారు. అంటే 2022లో ఖాళీ అయ్యే ఆరు రాజ్యసభ సీట్లలో బొత్స సత్యనారాయణది కచ్చితంగా ఒక సీటు అన్న మాట. ఇదిలా ఉంటే అనారోగ్య కారణాల వల్లనే బొత్స తప్పుకుంటున్నారు అని వైసీపీలో ఒక వర్గం ప్రచారం చేస్తోంది. కానీ బొత్స సత్యనారాయణను తప్పించడం పూర్తిగా రాజకీయ వ్యూహమే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Related Posts