YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పీసీసీ ప్రెసిడెంట్ గా చిరంజీవి..?

పీసీసీ ప్రెసిడెంట్ గా చిరంజీవి..?

న్యూఢిల్లీ, జూలై 29, 
రాజకీయాల్లో ఎన్నో చిత్రాలు. అందులో ఇదొకటి అనుకోవచ్చు. అయినా మెగాస్టార్ కి కాంగ్రెస్ సంబంధం లేదా? ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోలేదా? కొన్నేళ్ళ పాటు కేంద్రంలో పర్యాటక శాఖ మంత్రిగా ఆయన పనిచేయలేదా? మరి అలాంటపుడు ఇది అసంభవం అని ఎలా అనుకుంటారు. అందుకే ఈ రకమైన ప్రచారం ఒకటి గట్టిగానే సాగుతోంది. మొత్తానికి రేవంత్ రెడ్డిని తెలంగాణా పీసీసీ చీఫ్ ని చేసేసి కొంత భారాన్ని తగ్గించుకున్న కాంగ్రెస్ హై కమాండ్ ఇపుడు ఏపీ మీద కూడా దృష్టి పెట్టింది అంటున్నారు. ఏపీలో కూడా కాంగ్రెస్ కి బలం ఉంది. బాగా ఓట్లు ఉన్నాయి. ఈ రోజుకీ పార్టీని అట్టేపెట్టుకుని ఉన్న సీనియర్లు చాలా మంది ఉన్నారు. ఇంతమంది ఉన్నా కూడా కాంగ్రెస్ అనే ఏనుగు ఎందుకు లేవడంలేదు అంటే దాన్ని లేపగలిగే మొనగాడు కావాలని అంటున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. ఆ మావటి కోసమే వారు సెర్చ్ చేస్తున్నారు.చిరంజీవి మనవాడా కాదా అన్న డౌట్ ఏకంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకే వచ్చేసింది. చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉన్నారా అని ఆయన ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఉమెన్ చాందీని గట్టిగానే వాకబు చేశారుట. ఆయన మనవాడే కానీ పార్టీ ఓడాక ఆయన ఏ ఒక్క కాంగ్రెస్ మీటింగునకు హాజరు కాలేదని ఉమెన్ చాందీ బదులు ఇచ్చారుట. సరే ఆయన్ని అలాగే వదిలేస్తే ఏలా? ఆయన సేవలు వాడుకోవాలి కదా? అంటూ రాహుల్ ఉమెన్ చాందీని గదమాయించారుట. కాంగ్రెస్ తో చిరంజీవికి మంచి బంధం ఉందని కూడా గుర్తు చేసుకున్నారుట. అవును మరి ఆనాడు రాహుల్ గాంధీయే చిరంజీవికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు.మెగాస్టార్ ఇపుడేం చేస్తున్నారు అని కూడా రాహుల్ ఉమెన్ చాందీని ప్రశ్నించారు అంటున్నారు. ఆయన సినిమాలలో బిజీగా ఉన్నారని ఉమెన్ చాందీ చెప్పిన మీదట ఆయనతో ఫోన్ కలపండి, ఆయనను నాతో మాట్లాదించండి అంటూ ఆదేశాలు జారీ చేశారని సమాచారం. రాహుల్ గాంధీ ఇంతలా మెగాస్టార్ ని తలచుకోవడానికి కారణం ఆయన సినిమాటిక్ చరిష్మా. మరో వైపు ఆయన ఏ పార్టీలో ఇంతవరకూ చేరకపోవడం. అంటే చిరంజీవి ఇంకా కాంగ్రెస్ లో ఉన్నట్లుగానే రాహుల్ గుర్తిస్తున్నారుట. ఆయన్ని వదిలేశారు ఎందుకు అని పార్టీ వారి మీదనే ఆయన కోప్పడుతున్నారు తప్ప కాంగ్రెస్ సమావేశాలకు వరసబెట్టి చిరంజీవి గైర్ హాజరు అయిన విషయాన్ని మరచిపోతున్నారు. మొత్తానికి ఇదంతా కాంగ్రెస్ అతి ఆశగా ఉందని అంటున్నారు.చిరంజీవిని ఏపీ పీసీసీ చీఫ్ గా చేయాలని కూడా రాహుల్ భావిస్తున్నారుట. ఆయనతో తాను స్వయంగా మాట్లాడుతాను అనడంలో ఉద్దేశ్యాలు తెలిసినవే. తాను నచ్చచెప్పి చిరంజీవిని కాంగ్రెస్ వైపు ఉండేలా చూసుకోగలను అని ఆయన నమ్ముతున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకు బలం రావాలన్నా ఎంతో కొంత ఉనికి సాధించాలన్నా కూడా మెగాస్టార్ వంటి వారే ఉండాలని రాహుల్ గట్టిగానే డిసైడ్ అయినట్లుగా ఏపీ కాంగ్రెస్ వర్గాలలో చర్చ సాగుతోంది. అయితే తన సినిమాలు తాను అన్నట్లుగా ఉండడమే కాదు రాజకీయాల పట్ల పెద్దగా మోజు లేని మెగాస్టార్ ఇపుడు కాంగ్రెస్ సారధి అవుతారా అన్నదే పెద్ద డౌట్. ఆయన పోయి పోయి మరోసారి రాజకీయ రంధిలో చిక్కుకుంటారా అన్నది కూడా ప్రశ్నగానే ఉంది. చూడాలి మరి రాహుల్ వంటి వారు చెబితే, చిరంజీవికి సరైన హామీలు ఇచ్చి మెప్పిస్తే ఏమైనా జరగవచ్చు అంటున్నారు.

Related Posts