YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దళిత బంధు సెగ

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దళిత బంధు సెగ

హైదరాబాద్, జూలై 29, 
ఎన్నికలు ఎక్కడుంటే అక్కడే స్కీముల అమలు, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్న సీఎం కేసీఆర్ వ్యూహం బెడిసికొడుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హుజూరాబాద్ సెగ తగులుతోంది. హుజూరాబాద్లో ప్రారంభించబోయే దళిత బంధు స్కీమ్ తమ నియోజకవర్గాల్లోనూ అమలు కావాలంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిందేనని జనం సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.‘ఎమ్మెల్యే గారూ మీరు రాజీనామా చేయండి.. దళితబంధు సహా అన్ని పథకాలు, అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిధులు ఇస్తారు.. ఆ తర్వాత మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి గెలిపించుకుంటాం..’ అంటూ పోస్టులు పెడుతున్నారు. పబ్లిక్, సోషల్ యాక్టివిస్టులు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ వేదికగా క్యాంపెయిన్ నడుపుతున్నారు. వైరల్ అయితున్న ఈ పోస్టులకు ప్రజలు లైకులు, షేర్లతో మద్దతు తెలుపుతున్నారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే తమకూ పథకాలు, ఫండ్స్ వస్తాయని కామెంట్లు పెడ్తున్నారు.ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనా మా చేయడంతో హుజూరాబాద్లో జరగనున్న ఉప ఎన్నికలో గెలవడం టీఆర్ఎస్కు, వ్యక్తిగతంగా కేసీఆర్కు ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. ఎట్లైనా గెలిచి తీరాలని అనుకుంటున్న సీఎం కేసీఆర్, నియోజకవర్గంలో 48 వేల దాకా ఉన్న దళితుల ఓట్లపై కన్నేశారు. వాటిని గంపగుత్తగా రాబట్టాలనే వ్యూహంతో ‘దళిత బంధు’ స్కీంను హుజూరాబాద్నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలో సుమారు 20 వేల దళిత కుటుంబాలు ఉండగా, ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అకౌంట్లలో వేస్తామని, ఇష్టమొచ్చిన వ్యాపారం చేసుకోవచ్చని ఆఫర్ ఇచ్చారు. వాస్తవానికి దళితబంధు స్కీం ప్రకటించినప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఎంపిక చేసిన వంద కుటుంబాలకు పైలట్ప్రాజెక్టుగా అమలుచేస్తామన్న సీఎం, ఉప ఎన్నికల నేపథ్యంలో మాటమార్చారు. ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే 20 వేల కుటుంబాలకు ఏకంగా రూ.2వేల కోట్లు ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

Related Posts