YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

దసరా తర్వాత వర్క్ ఎట్ ఆఫీసులు

 దసరా తర్వాత వర్క్ ఎట్ ఆఫీసులు

హైదరాబాద్, జూలై 29, 
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్‌ మహమ్మారి కారణంగా దాదాపు ఏడాదిన్నర నుంచి ఐటీ కారిడార్‌ మూగబోయింది. ఉద్యోగులు, సిబ్బంది ఆఫీసులకు రాకపోవడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది జీవితాలపై దీని ప్రభావం పడుతున్నది. వర్క్‌ ఫ్రం హోం కారణంగా ఉత్పాదన తగ్గుతున్నదని కంపెనీలు భావిస్తుండటం.. వర్క్‌ ఫ్రం హోంకు స్వస్తి పలికి కార్యాలయాలకు వచ్చేందుకు ఉద్యోగులు ఇష్టపడుతుండటంతో సమస్య పరిష్కా రం దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతోపాటు ఇప్పట్లో మూడో వేవ్‌ ముప్పు ఉండబోదని అధ్యయనాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులను మళ్లీ కార్యాలయాలకు రప్పించాలని ఐటీ కంపెనీలు, అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగం గా తెలంగాణ ఐటీశాఖ అధికారులు 300 కంపెనీలతో మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వీటిలో చాలా కంపెనీలు ‘వర్క్‌ ఫ్రం ఆఫీస్‌’ విధానాన్ని పునఃప్రారంభించేందుకు అంగీకరించాయి. ప్రస్తుతానికి కనీసం 30 శాతం మంది ఉద్యోగులతో మొదలుపెట్టి ఈ ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయిలో సిబ్బందిని రప్పించేందుకు పలు కంపెనీలు ఒప్పుకున్నాయని ఐటీ వర్గాలు తెలిపాయి.వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ విధానాన్ని తొలుత పునఃప్రారంభించేందుకు ఇన్ఫోసిస్‌ సిద్ధమవుతున్నది. ఇన్ఫోసిస్‌ ఉద్యోగుల్లో చాలామంది కార్యాలయాలకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ కంపెనీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దాదాపు అన్ని కంపెనీల్లోని మెజారిటీ ఉద్యోగులు ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తున్నది. హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) నిర్వహించిన సర్వే ప్రకారం.. 55 శాతం మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం పట్ల అనాసక్తి వ్యక్తం చేశారు. వర్క్‌ ఫ్రం హోం వల్ల ఉత్పాదకత సైతం తక్కువగా నమోదవుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది మే నెలలో 10 వేల మంది ఐటీ ఉద్యోగులపై సర్వే నిర్వహించగా.. 20 శాతం ఉత్పాదకత తగ్గినట్లు స్పష్టమైంది.వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ విధానాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న కంపెనీలు తమ ఉద్యోగులంతా కొవిడ్‌ టీకాలు తీసుకునేలా చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటివరకు టీసీఎస్‌ ఉద్యోగుల్లో 70 శాతం మంది టీకాలు వేయించుకోగా.. హెచ్‌సీఎల్‌ టెక్‌ ఉద్యోగుల్లో 74 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది. విప్రో, టీసీఎస్‌ కంపెనీలు తమ ఉద్యోగులను సెప్టెంబర్‌లోగా ఆఫీసులకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కంపెనీల కార్యాలయాలను తిరిగి ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే హాస్పిటాలిటీ, రిటైల్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాలు పూర్వ స్థితికి వచ్చాయి. ఐటీ కంపెనీలపై కేవలం ఐటీ ఉద్యోగులే కాకుండా ఎంతో మంది జీవితాలు ఆధారపడ్డాయి. ఈ రంగం దీర్ఘకాలం నుంచి ఇలాగే కొనసాగటం వల్ల వివిధ రంగాలపై దుష్ప్రభావం పడుతున్నది. ముఖ్యంగా హోటళ్లు, దుకాణాలు, ట్రాన్స్‌పోర్ట్‌, హౌజ్‌ కీపింగ్‌ స్టాఫ్‌, సెక్యూరిటీ స్టాఫ్‌, కెఫిటేరియా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Related Posts