YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హుజూరాబాద్ లో వామపక్షాల దారెటెు

హుజూరాబాద్ లో వామపక్షాల దారెటెు

కరీంనగర్, జూలై 29, 
లెఫ్ట్‌ పార్టీల ప్రభావం ఉన్న హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఎత్తుగడ ఏంటి? వామపక్షాల మద్దతు కూడగడుతుందా? గత ఉపఎన్నికల చరిత్ర ఏం చెబుతోంది? అవే వ్యూహాలు హుజురాబాద్‌లో రిపీట్‌ అవుతాయా?హుజురాబాద్ ఉపఎన్నిక సమరానికి రాజకీయపార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే పనిలో బీజీగా ఉన్నాయి ప్రధాన పార్టీలు. ఉపఎన్నికకు శ్రేణులను రెడీ చేస్తున్నారు నాయకులు. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ నియోజకవర్గంలో ప్రచారం ఊదరగొడుతోంది. మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇంచార్జ్‌లును నియమించి గ్రౌండ్ వర్క్ చాలారోజుల కిందటే మొదలుపెట్టేసింది. ఈ క్రమంలో హుజురాబాద్‌లోని వామపక్షాల మద్దతు కోసం టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తుందా లేదా అన్నది చర్చగా మారింది.ఉపఎన్నికలు టీఆర్‌ఎస్‌కు కొత్తకాదు. స్థానిక రాజకీయ పరిస్థితులపై లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఎత్తుగడలు వేస్తూ వస్తోంది అధికారపార్టీ. ఒంటరిగా బరిలో దిగుతూనే.. కలిసొచ్చే పక్షాలను.. కలిస్తే గెలుపు నల్లేరుపై నడక అనుకున్న పార్టీల మద్దతు కూడగట్టేది. ఆ విధంగా అవసరం అనుకున్నచోట వామపక్ష పార్టీల మద్దతు కోరిన సందర్భాలు గత ఉపఎన్నికల్లో ఉంది.హుజూర్‌నగర్ బైఎలక్షన్ లో సీపీఐ సపోర్ట్‌ కోసం యత్నించింది. అప్పట్లో ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వంపై విమర్శలు పెరగడంతో సీపీఐ వెనక్కి తగ్గింది. అప్పటికే మద్దతుపై నియెజకవర్గ స్థాయిలో సంకేతాలు వెళ్లడంతో సీపీఐ శ్రేణులు గులాబీపార్టీకి మద్దతిచ్చాయన్న వాదన ఉంది.నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చే విషయాన్ని వామపక్ష పార్టీ లు స్థానిక నాయకత్వాలకు అప్పగించాయి. ఆ విధంగా లోకల్‌ లెఫ్ట్‌ లీడర్స్‌ అధికారపార్టీకి సపోర్ట్‌ చేశారు.ఇప్పుడు హుజురాబాద్ ఉపఎన్నిక రాబోతుంది. ఇక్కడ కూడా వామపక్ష పార్టీలు టీఆర్‌ఎస్‌కు అండగా నిలుస్తాయా లేదా అన్న చర్చ జరుగుతోంది. హుజురాబాద్‌లో వామపక్ష పార్టీల ప్రభావం ఎంతో కొంత ఉంటుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. అందుకే ఈ ఉపపోరులో సీపీఐ, సీపీఎంల వైఖరి ఏంటన్నది ఆసక్తిగా మారింది. హుజురాబాద్‌లో పోటీ చేయాలా లేక.. ఇంకెవరికైనా మద్దతివ్వాలా అన్నది వామపక్షాలు నిర్ణయం తీసుకోలేదు.హుజురాబాద్‌లో లెఫ్ట్‌ పార్టీలు కలిసి పోటీ చేసినా.. వేర్వేరుగా బరిలో దిగినా.. వారి ఓటు బ్యాంక్‌ వారికే పడుతుంది. స్థానికంగా నెలకొన్న రాజకీయ పరిణామాల కారణంగా ఓట్ల చీలిక మంచిదా కాదా అన్న చర్చ ప్రధాన పార్టీల్లో ఉంది. ఒకవేళ వారు పోటీ చేయకపోతే.. ఆ ఓటు బ్యాంకు కీలకంగా మారుతుంది. అప్పుడు ఏదో ఒక పార్టీ లెఫ్ట్‌ మద్దతు కూడగట్టే అవకాశాలు ఉంటాయి. అదే పరిస్థితి వస్తే.. అధికార పార్టీ ఛాన్స్‌ తీసుకోదనే వాదన ఉంది. అందుకే హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు జీ హుజూర్‌ అనే పక్షాలు ఏంటన్నది ఆసక్తిగా మారింది.

Related Posts